ఆదర్శ గ్రామంగా సున్నిపెంట
ABN , Publish Date - Jul 31 , 2026 | 11:30 PM
: శ్రీశైల మండలంలోని సున్నిపెంట గ్రామంలో నెలకొన్న సమస్యలను త్వరగా పరి ష్కరించి జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని కలెక్టర్ రాజకుమారి అన్నారు.
కలెక్టర్ రాజకుమారి
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 350 అర్జీలు
శ్రీశైలం, జూలై 31 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల మండలంలోని సున్నిపెంట గ్రామంలో నెలకొన్న సమస్యలను త్వరగా పరి ష్కరించి జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని కలెక్టర్ రాజకుమారి అన్నారు. ప్రజల నుంచి అందిన ప్రతి వినతిని సానుకూల దృక్పథంతో పరిశీలించి క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేసి సాధ్యాసాధ్యాలతో నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్క రించాలని అధికారులను ఆదేశించారు. వన్ మంత్ ఫోర్ విజిట్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సున్నిపెంటలోని రెడ్ల కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ శ్రీశైల మండలంలో అపరిష్కృత సమస్యలను తెలియజేస్తూ 350 అర్జీలు దర్బారులో నమోదు అయినట్లు చెప్పారు. సున్నిపెంట గ్రామంలో ప్రధానంగా పక్షం రోజులకోసారి తాగునీళ్లు వస్తున్నాయని, ఇళ్ల స్థలాలు, గృహాలు, పింఛన్లు, విద్యుత్ మీటర్లు, వీధి దీపాలు, పారిశుధ్యం, అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, రవాణా వంటి ప్రాథమిక సమస్యలపై ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ప్రతి అర్జీని డిజిటలైజేషన్ చేసి సంబంధిత శాఖలతో పర్యవేక్షణ, పరిష్కరంతో పాటు ఉత్తర్వుల ప్రతిని అర్జ్జీదారునికి తప్పక పంపించాలని సూచించారు.
రూ. 15 కోట్లతో మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారం- ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి
సున్నిపెంట ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న ప్రధాన మైన మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ప్రణాళికలు రూపొందిం చింది. రూ.15 కోట్లతో పైపులైను పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. గతంలో 6కోట్ల నిధులు విడుదల కాగా ప్రస్తుతం జల్ జీవన్ మిషన్ ద్వారా 9.11 కోట్లు నిధులు కేటాయిస్తూ జరుగుతున్న పనులతో సున్నిపెంట ప్రజ లకు శాశ్వతంగా మంచినీటి సమస్య తొలగిపోతుంది.
తప్పుడు ఫిర్యాదులు పంపవద్దు : ఎస్పీ సునీల్ షరాన్
తప్పుడు ఫిర్యాదులతో అధికారులను తప్పుదోవ పట్టించేందుకు యత్నించవద్దు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటాం.