వైభవంగా సుంకులా పరమేశ్వరి రథోత్సవం
ABN , Publish Date - Apr 03 , 2026 | 12:26 AM
మండలంలోని కె నాగలాపురం గ్రామంలో సుంకులా పరమేశ్వరి బహ్మోత్సవాల్లో భాగంగా గురువా రం రథోత్సవం భక్తజనుల మధ్య వైభవంగా జరిగింది.
గూడూరు ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): మండలంలోని కె నాగలాపురం గ్రామంలో సుంకులా పరమేశ్వరి బహ్మోత్సవాల్లో భాగంగా గురువా రం రథోత్సవం భక్తజనుల మధ్య వైభవంగా జరిగింది. ఈ సంద ర్భంగా సుంకులా పరమేశ్వరి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మ వారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమించారు. అమ్మవారికి అర్చకులు అభిషేకం, మంగళ హారతి తదితర పూజలు నిర్వహించారు. రథోత్సవానికి తరలివచ్చిన భక్తులు ఆలయ కార్యనిర్వాహణాధికారి పీఎన రాధాకృష్ణ అన్ని సౌక ర్యాలు కల్పించారు. రథోత్సవానికి ఉమ్మడి జిల్లా నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. అమ్మవారిని ఆలయ నిర్మాణ దాత రాజ్‌కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అలాగే కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి రథోత్సవంలో పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. ఆయన వెంట టీడీపీ మండల అధ్యక్షుడు జె సురేష్, గోపాల్ రెడ్డి, ఆలయ అధికా రులు, గ్రామ పెద్దలు ఉన్నారు.