Share News

రైతులకు అనుకూలం

ABN , Publish Date - Mar 19 , 2026 | 11:46 PM

శ్రీపరాభవ నామ సంవత్సరం రైతులకు అనుకూలమని, సస్యశ్యామలంగా పం టలు పండి, రైతులు స్వర్ణయుగాన్ని చూస్తారని శ్రీశైల దేవ స్థాన ఆస్థాన పంచాంగకర్త బుట్టే వీరభద్ర దైవఙ్ఞ స్పష్టం చేశారు.

రైతులకు అనుకూలం
పంచాంగ శ్రవణం చేస్తున్న బుట్టే వీరభద్ర దైవఙ్ఞ

పరాభవ నామ సంవత్సరంలో రాష్ట్రం సుభిక్షం

అధిక వర్షపాతంతో ఆనకట్టలకు జలకళ

మంచి దిగుబడులూ, ధరలూ

ప్రకృతి వైపరీత్యాలు తక్కువే

శ్రీశైల దేవస్థానంలో పంచాంగం వినిపించిన బుట్టే వీరభద్ర దైవఙ్ఞ

శ్రీశైలం, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): శ్రీపరాభవ నామ సంవత్సరం రైతులకు అనుకూలమని, సస్యశ్యామలంగా పం టలు పండి, రైతులు స్వర్ణయుగాన్ని చూస్తారని శ్రీశైల దేవ స్థాన ఆస్థాన పంచాంగకర్త బుట్టే వీరభద్ర దైవఙ్ఞ స్పష్టం చేశారు. గురువారం అక్కమహాదేవి అలంకార మండపంలో పంచాగ శ్రవణం కార్యక్రమాన్ని ఈవో శ్రీనివాసరావు ఆధ్వ ర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బుట్టే వారు భవిష్యవాణి వివరిస్తూ రుద్రాధిపత్యంగా పరిపాలన జరిగే పరాభవ సంవత్సరంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని అధి క వర్షపాతాలతో కుంటలు, చెరువులు, ఆనకట్టలు నిండుగా జలకళను సంతరించుకుంటాయని చెప్పారు. వ్యవసాయ రంగానికి వాతావరణం అనుకూలించడంతో అన్ని రకాల పం టలకు అధిక దిగుబడులు వస్తాయని, ధరలు బాగా ఉం టాయని తెలిపారు. కాలాన్ని సరిదిద్దే అధికమాసంతో కలిసి వచ్చిన పరాభవ సంవత్సరంలో ప్రకృతి వైపరీత్యాలు తక్కు వగా ఉంటాయని, పుష్కర స్నానాలతో ప్రజలకు శుభాలు కలుగుతాయని అన్నారు. రానున్న ఎండాకాలంలో సుమారు 50 డిగ్రీలకు పైగా ఉష్టోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పశ్చిమ దేశాలలో జరుగుతున్న భీకర యుద్ధ ప్రభావం మన భరత భూమిపై అంతంత మాత్రంగానే ఉంటుందని, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదని తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రజానీకం సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం అనేక సరికొత్త ప్రణాళికాలను ప్రవేశపెడుతుందని అన్నారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్ల దేవస్థానం పరిధిలో భక్తుల సౌకర్యార్థం చేసే అభివృద్ధి పనులు గణనీ యంగా పెరుగుతాయన్నారు. ప్రపంచ వ్యాప్తమైన శివతత్వం తోపాటు జ్యోతిర్లింగ శక్తిపీఠమైన శ్రీశైల క్షేత్రం దేశానికే తలమానికమవుతుందని చెప్పారు. గ్రహజాతక రీత్యా కలిగే ప్రయోజనాలు, ఆటంకాల నివారణకు తగిన పరిష్కార మార్గాలను సూచించిన భవిష్యవాణి కార్యక్రమంలో కలెక్టర్‌ రాజకుమారి, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 29 సంవత్సరాలుగా శ్రీశైల దేవస్థానానికి ఆధ్యాత్మిక సేవలంది స్తున్న దైవఙ్ఞ వారిని కలెక్టర్‌ సన్మానించారు.

Updated Date - Mar 19 , 2026 | 11:46 PM