Share News

అత్తింటి వేధింపులతోనే ఆత్మహత్య

ABN , Publish Date - Aug 18 , 2026 | 11:55 PM

అత్తింటి వారి వేధింపుల వల్లే శివప్రియ ఆత్మహత్య చేసుకుందని, వారిపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, బంధువులు కేజీ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సోమవారం సాయంత్రం పట్టణానికి చెందిన శివప్రియ ఉరి వేసుకొని ఉంది. శివప్రియ తల్లిదండ్రులు మంగళవారం ఉదయం మార్చురీలోని మృతదేహాన్ని పరిశీలించి కన్నీటి పర్యంతమయ్యారు

అత్తింటి వేధింపులతోనే ఆత్మహత్య
కేజీ రోడ్డుపై రోదిస్తున్న శివప్రియ తల్లి లక్ష్మీదేవి.. దాడికి ప్రయత్నిస్తున్న సీపీఎం నాయకుడు నాగేశ్వరరావు

నందికొట్కూరు, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): అత్తింటి వారి వేధింపుల వల్లే శివప్రియ ఆత్మహత్య చేసుకుందని, వారిపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, బంధువులు కేజీ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సోమవారం సాయంత్రం పట్టణానికి చెందిన శివప్రియ ఉరి వేసుకొని ఉంది. శివప్రియ తల్లిదండ్రులు మంగళవారం ఉదయం మార్చురీలోని మృతదేహాన్ని పరిశీలించి కన్నీటి పర్యంతమయ్యారు. తాను సీపీఎం నాయకుడిని అని, తనను ఎవరూ ఏమీ చేసుకోలేరని నాగేశ్వరరావు బెదిరిస్తున్నారని శివప్రియ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నాగేశ్వరరావు కుటుంబ సభ్యులకు, శివప్రియ బంధువులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని వారి అక్కడి నుంచి పోలీస్టేషన్‌కు తీసుకెళ్లారు. పోలీసులను సీపీఎం నాయకులు మభ్యపెడుతున్నారని, శివప్రియకు అన్యాయం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేజీ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. శివప్రియ తల్లిదండ్రులు, కుటుంబస భ్యులు నిరసనను విరమింపజేసేందుకు వచ్చిన ఎస్‌.చంద్రశేఖర్‌ కాళ్లపైపడి ప్రాధేయపడ్డారు. మీరు ఫిర్యాదు చేస్తే వెంటనే వారిపై కేసు నమోదు చేస్తామని హమీ ఇవ్వడంతో నిరసన ఉపసంహరించారు. శివప్రియ భర్త శివకుమార్‌, అత్తామామలు నాగేశ్వరరావు, నాగేశ్వరమ్మపై అదనపు కట్నం వేధింపులు, గృహహింస కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు

Updated Date - Aug 18 , 2026 | 11:55 PM