Share News

జాతీయ స్థాయిలో రాణించాలి

ABN , Publish Date - Nov 19 , 2026 | 12:01 AM

జాతీయ స్థాయి స్కేటింగ్‌లో స్కేటింగ్‌ క్రీడాకారులు పతకాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్‌ సిరి అన్నారు.

జాతీయ స్థాయిలో రాణించాలి
క్రీడాకారులను అభినందిస్తున్న కలెక్టర్‌ సిరి

స్కేటింగ్‌ క్రీడాకారులకు కలెక్టర్‌ అభినందనలు

కర్నూలు స్పోర్ట్స్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయి స్కేటింగ్‌లో స్కేటింగ్‌ క్రీడాకారులు పతకాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్‌ సిరి అన్నారు. ఈ నెల 9 నుంచి 15 వరకు కాకినాడలో జరిగిన 38వ రాష్ట్ర స్థాయి స్కేటింగ్‌ రింగ్‌ పోటీల్లో కర్నూలు క్రీడాకారులు ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. కర్నూలు జిల్లాకు చెందిన ఎన్‌ఎండీ ఇర్ఫాన్‌ పురుషుల విభాగంలో రింక్‌ రేస్‌లో కాంస్య పతకం సాధించి రోడ్‌ రేస్‌లో వెండి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అలాగే అండర్‌-15 బాలికల విభాగంలో భవిష్య తేజ రోడ్‌రే్‌సలో వెండి పతకాన్ని సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైందని జిల్లా అదనపు కార్యదర్శి అన్నం పునీత చౌదరి, సీఈవో పి.సునీల్‌ కుమార్‌ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని చాంబర్‌లో కలెక్టర్‌ వారిని అభినందించారు. జాతీయ స్థాయిలో రాణించి పతకాలతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. డీఎ్‌సడీవో భూపతిరావు, జిల్లా స్కేటింగ్‌ సంఘం సంయుక్త కార్యదర్శి స్రవంతి, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Updated Date - Nov 19 , 2026 | 12:04 AM