Share News

సబ్సిడీని సమయానికి చెల్లించాలి

ABN , Publish Date - Jan 27 , 2026 | 11:19 PM

విద్యుత్‌ రంగంలో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఎంతో కీలకం, బలహీన వర్గాల రక్షణకు సబ్సిడీలను సమయానికి విడుదల చేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) కమిషన్‌ చైర్మన్‌ పీవీఆర్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు.

సబ్సిడీని సమయానికి చెల్లించాలి

ఏపీఈఆర్‌సీ చైర్మన్‌ పీవీఆర్‌ రెడ్డి

విద్యుత్‌ చార్జీలపై అభిప్రాయ సేకరణ

కల్లూరు, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ రంగంలో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఎంతో కీలకం, బలహీన వర్గాల రక్షణకు సబ్సిడీలను సమయానికి విడుదల చేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) కమిషన్‌ చైర్మన్‌ పీవీఆర్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. 2026-27 ఆర్ధిక సంవత్సరానికి డిస్కంలు ప్రతిపాదించిన ఏఆర్‌ఆర్‌, విద్యుత్‌ చార్జీలపై మంగళవారం దిన్నెదేవరపాడులోని ఏపీఈఆర్‌సీ భవన్‌లో బహిరంగ ప్రజా అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ అభిప్రాయ సేకరణలో పలువురు నేరుగా పాల్గొనగా మరికొందరు వర్చువల్‌గా తమ అభిప్రాయాలను వెల్లడించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి టారిఫ్‌ ఆర్డర్‌పై నిర్వహించిన పబ్లిక్‌ హియరింగ్‌ ప్రక్రియను ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ కమిషన్‌ ముగించినట్లు ఏపీఈఆర్‌సీ చైర్మన్‌ ప్రకటించారు. ఇప్పటికే తిరుపతి, విజయవాడ, కర్నూలు కేంద్రాల్లో ప్రత్యక్షంగా, ఆన్‌లైన్‌ ద్వారా వివిధ వర్గాల ప్రతినిధులు, వినియోగదారులు, సంఘాలు తమ అభిప్రాయాలను వెల్లడించారని తెలిపారు. ఈమేరకు విద్యుత్‌ చార్జీలు, సబ్సిడీలు, డిస్కంల ఆర్థిక స్థిరత్వం, వినియోగదారులపై భారం వంటి అంశాలపై విస్తృత చర్చ జరిగిందన్నారు. డిస్కంలు సమర్పించిన ఏఆర్‌ఆర్‌, టారిఫ్‌ ప్రతిపాదనలు, వాటాదారుల లిఖిత, మౌఖిక అభిప్రాయాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం టారిఫ్‌ ఆర్డర్‌ను జారీ చేస్తామని తెలిపారు. విద్యుత్‌ చట్టం-2003 ప్రకాఆరం ప్రజాహితాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ వీఎ్‌సఎ్‌స.ప్రవీణ్‌, ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ పి.పుల్లారెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ ఎల్‌.శివశంకర్‌, సీజీఎం ఎం.ఉమాపతి, కర్నూలు ఆపరేషన్స్‌ ఎస్‌ఈ ప్రదీ్‌పకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 27 , 2026 | 11:19 PM