Share News

సబ్సిడీ విత్తనాలను వినియోగించుకోవాలి

ABN , Publish Date - Sep 30 , 2026 | 12:20 AM

రైతులు ప్రభుత్వం అందించే సబ్సిడీ విత్తనాలను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి సూచించారు.

సబ్సిడీ విత్తనాలను వినియోగించుకోవాలి
రైతులకు సబ్సిడీ శనగ విత్తనాలను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే

ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

ఓర్వకల్లు, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): రైతులు ప్రభుత్వం అందించే సబ్సిడీ విత్తనాలను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి సూచించారు. ఓర్వకల్లులోని రైతు సేవా కేంద్రంలో 35 శాతం సబ్సిడీపై శనగ విత్తనాలను ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పంపిణీ చేశారు. పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో మంజూరైన గడ్డి విత్తనాలను 75 శాతం సబ్సిడీతో రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలానికి 1400 క్వింటాళ్ల శనగ విత్తనాలు కేటాయించారన్నారు. కార్యక్రమంలో ఏవో మధుమతి, కూటమి నాయకులు పాల్గొన్నారు.

ఆలయాభివృద్ధికి దాతలు సహకరించాలి: ఆలయాభివృద్ధికి దాతలు సహకరించాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. మండలంలోని సోమయాజులపల్లెలో వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి పది సెం ట్ల భూమిని కేటాయిస్తూ మంజూరు పత్రాన్ని ఎమ్మెల్యే, తహసీల్దార్‌ విద్యాసాగర్‌ చేతుల మీదుగా గ్రామస్థులకు పట్టాను పంపిణీ చేశారు. టీటీడీ నిధులు రూ.40లక్షలతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏఈలు శ్రీనివాసులు, సురేంద్రనాథ్‌ రెడ్డి, ఏపీవో మద్దేశ్వర మ్మ, కోర్టు డైరెక్టర్‌ నాగ ఎర్రమల, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గోవిందరెడ్డి, మండల కన్వీనర్‌ నాగిరెడ్డి, సింగిల్‌ విండో చైర్మన్లు సుధాకర్‌రావు, నాగే శ్వరరెడి, నాయకులు రాంభూపాల్‌ రెడ్డి, మోహనరెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి, జనార్దన రెడ్డి, అన్వర్‌, ఏసేపు, రాజశేఖర్‌, నాగమల్లేష్‌, ఆకుల మహేష్‌, కాకి దేవేంద్ర, ప్రతాప్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 30 , 2026 | 12:20 AM