Share News

ఏజెంట్ల వివరాలు సమర్పించండి

ABN , Publish Date - May 08 , 2026 | 12:20 AM

నియోజకవర్గ పరిధిలోని బూతల వారీగా ఏజెంట్ల వివరాలు అందించాలని కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు కోరారు.

ఏజెంట్ల వివరాలు సమర్పించండి
రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమైన కమిషనర్‌ చల్లా ఓబులేసు

కర్నూలు ఆర్వో, నగర పాలక కమిషనర్‌ చల్లా ఓబులేసు

కర్నూలు కల్చరల్‌, మే 7(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గ పరిధిలోని బూతల వారీగా ఏజెంట్ల వివరాలు అందించాలని కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు కోరారు. గురువారం నగరపాలక కార్యాలయంలో రాజకీ య పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కమిషనర్‌ మా ట్లా డుతూ నియోజకవర్గ పరిధిలో 258 బూతల వారీగా ఏజెంట్ల వివరాలు అందించాలని గతంలో పలుమార్లు కోరామని, వీలైనంత త్వర గా ఏజెం ట్ల వివరాలు అందించాలని ఆయా పార్టీల ప్రతినిధులకు ఆయన సూచిం చారు. డిప్యూటీ కమిషనర్‌ సతీష్‌కుమార్‌ రెడ్డి, ఎస్‌ఈ రమణమూర్తి, డి ప్యూటీ తహసీల్దారు ధనుంజయ, సూపరింటెండెంట్‌ సుబ్బన్న పాల్గొన్నారు.

ఎల్‌ఆర్‌ఎస్‌ మేళాకు విశేష స్పందన

కర్నూలు న్యూసిటీ: ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించి ఇప్పటికే దరఖాస్తు చేసుకుని వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఎల్‌ఆర్‌ఎస్‌ మేళాకు విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి ప్రక్రియ పూర్తి చేసి ప్రొసీడింగ్స్‌ అందజేసేందుకు నగర పాలక సంస్థ కార్యాలయంలో గురువారం ప్రారం భించిన ఎల్‌ఆర్‌ఎస్‌ మేళాకు దరఖాస్తుదారులు పెద్దఎత్తున తరలి వచ్చారు. ప్రక్రియ పూర్తి చేస్తున్న వారికి కమిషనర్‌ చల్లా ఓబులేసు ప్రొసిడింగ్స్‌ పత్రాలు అందజేశారు. ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు గడువు ముగిసిన నేపథ్యంలో ప్రక్రియ పూర్తికి అవసరమైన షార్ట్‌ ఫాల్‌ పత్రాలు సమర్పించి, ఫీజులు చెల్లించిన వారికి ధ్రువీకరణ పత్రాలు, ప్రొసీడింగ్స్‌ అందజేస్తున్నారు. కార్యక్రమంలో ఇనచార్జి సిటీ ప్లానర్‌ వై.వెంకటరమణ, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్‌భాష, బిల్డింగ్‌ ఇనస్పెక్టర్లు, ప్లానింగ్‌ కార్యదర్శులు, ఎల్‌టీపీలు పాల్గొన్నారు.

తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు

నగరంలో వేసవి దృష్ట్యా తాగునీటి సమస్య తెలెత్తకుండా చర్యలు తీసుకోవాలని నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు అధికారుల ను ఆదేశించారు. గురువారం ఆయన అశోక్‌నగర్‌ పంప్‌హౌస్‌ను ఆయన తనిఖీ చేశారు. ఇటీవల 600 ఎంఎం పైప్‌లైన మరమ్మతులకు గురికా వడంతో కేవలం 5 గంటల్లోనే పనులు పూర్తి చేశారని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా సమర్థవంతంగా పని చేసిన అధికారులను కమిష నర్‌ అభినందించారు. ఆయన వెంట ఏఈ జనార్ధన, శానిటేషన ఇన్సపెక్టర్‌ మునిస్వామి ఉన్నారు.

Updated Date - May 08 , 2026 | 12:20 AM