Share News

నెలాఖరులోగా పత్తికొండలో సబ్‌ కోర్టు

ABN , Publish Date - Sep 17 , 2026 | 11:32 PM

ఈ నెలాఖరులోగా పత్తికొండలో సబ్‌కోర్టును ప్రారంభిస్తామని జిల్లా ఇన్‌చార్జి న్యాయాధికారి వాసు తెలిపారు.

నెలాఖరులోగా పత్తికొండలో సబ్‌ కోర్టు
పత్తికొండ సబ్‌జైలులో ఖైదీలకు అవగాహన కల్పిస్తున్న ఇన్‌చార్జి న్యాయాధికారి వాసు

జిల్లా ఇన్‌చార్జి న్యాయాధికారి వాసు

పత్తికొండ, సెప్టెంబరు 17.(ఆంధ్రజ్యోతి): ఈ నెలాఖరులోగా పత్తికొండలో సబ్‌కోర్టును ప్రారంభిస్తామని జిల్లా ఇన్‌చార్జి న్యాయాధికారి వాసు తెలిపారు. జిల్లా న్యాయసేవాధికారి సంస్థ కార్యదర్శి లీలా శేషాద్రితో కలసి ఆయన గురువారం పత్తికొండకు వచ్చారు. పత్తికొండ ఇన్‌చార్జి న్యాయాధికారి హేమలతతో కలసి నూతనంగా మంజూరైన సబ్‌కోర్టు ఏర్పాటు కోసం కేటాయించిన భవనాన్ని పరిశీలించారు. నెలాఖరులోగా సబ్‌ కోర్టును ప్రారంభిస్తామని ఈ సందర్భంగా అన్నారు. అనంతరం సబ్‌ జైల్‌ను తనిఖీచేసి ఖైదీలకు అందించే భోజనం నాణ్యతను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ బార్‌ అసోసియేషన్‌ ప్రసిడెంట్‌ మధుబాబు, సీనియర్‌, జూనియర్‌ న్యాయవాదులు పాల్గొన్నారు.

Updated Date - Sep 17 , 2026 | 11:32 PM