Share News

విద్యార్థులు ఇష్టంగా చదవాలి

ABN , Publish Date - Oct 09 , 2026 | 12:48 AM

విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.

విద్యార్థులు ఇష్టంగా చదవాలి
విద్యార్థులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

ఓర్వకల్లు, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని కన్నమడకల మండల పరిషత ఆదర్శ ప్రాథమిక పాఠశాలను ఆమె తనిఖీ చేశారు. విద్యార్థులతో ఆమె కాసేపు మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకు న్నారు. విద్యార్థులు సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అనంతరం ఉపాధ్యా యులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు పాఠాలు అర్థమయ్యే రీతిలో బోధించాలన్నారు. పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో నాగ అనసూయ, ఎంఈవో ఓంకార్‌ యాదవ్‌, హెచఎంలు మద్దమ్మ, బేగ్‌, టీడీపీ మండల కన్వీనర్‌ నాగిరెడ్డి, సింగిల్‌ విండో చైర్మన్లు సి.సుధాకర్‌ రావు, నాగేశ్వరరెడ్డి, విద్యాకమిటీ చైర్మన రామ కృష్ణ, గ్రామ పెద్దలు వెంకటేశ్వర్లు, శివకుమార్‌, ఎల్ల నాగన్న, ఉపాధ్యా యులు పాల్గొన్నారు.

గ్రామీణులకు ఆధునిక వైద్యసేవలు: గ్రామీణులకు ఆధునిక వైద్యసేవలు అందించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. గురువారం ఓర్వకల్లులోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో మెడికల్‌ ఆఫీసర్‌ డా.కిషోర్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెడికల్‌ క్యాంప్‌నకు ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కార్పొరేట్‌ ఆసుప త్రుల కు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయన్నారు. అనంతరం ఆమె ఆసుపత్రి పరిసరాలను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్యసే వలు, సౌకర్యాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గోవిందరెడ్డి, మండల కన్వీనర్‌ నాగిరెడ్డి, వైద్యులు దాదాబాషా, నిక్కత నసీరున, ఆసుపత్రి కమిటీ సభ్యులు లక్ష్మీకాంతరెడ్డి, సుశీలమ్మ, సింగిల్‌ విండో చైర్మన్లు సుధాకర్‌ రావు, నాగేశ్వరరెడ్డి, నాయకులు రాంభూపాల్‌ రెడ్డి, యేసే పు, మీదివేముల రామాంజనేయులు, హెల్త్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 09 , 2026 | 12:48 AM