విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Jun 22 , 2026 | 11:56 PM
విద్యార్థుల సమస్య లను పరిష్కరించాలని ఆర్‌ఎస్‌యూ జిల్లా శాఖ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
కర్నూలు ఎడ్యుకేషన్, జూన 22 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల సమస్య లను పరిష్కరించాలని ఆర్‌ఎస్‌యూ జిల్లా శాఖ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆర్‌ఎస్‌యూ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. ఆర్‌ఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఆకుమల్ల శ్రీధర్ మాట్లాడుతూ ప్రభుత్వ హాస్టల్‌లో సరైన వసతి, సాగునీరు, మరుగుదొడ్లు, నాణ్యమైన భోజనం వంటి కనీస సౌక ర్యాలు కూడా అందుబాటులో లేవని ఆందోళన వ్యక్తంచేశారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతతో పాటు, మౌలిక వసతులు విద్యార్థులను వేధిస్తున్నాయన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌యూ నాయ కులు కౌశిక్, లోకేశ, విద్యార్థులు పాల్గొన్నారు.