Share News

విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చుకోవాలి: డీఈవో

ABN , Publish Date - Jul 17 , 2026 | 11:24 PM

విద్యార్థులు మొదటగా క్రమ శిక్షణ అలవర్చుకోవాలని డీఈవో జనార్దన్‌రెడ్డి సూచించారు.

విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చుకోవాలి: డీఈవో
కేజీబీవీ విద్యార్థినులతో డీఈవో జనార్దన్‌రెడ్డి

బండిఆత్మకూరు, జూలై 17(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు మొదటగా క్రమ శిక్షణ అలవర్చుకోవాలని డీఈవో జనార్దన్‌రెడ్డి సూచించారు. బండి ఆత్మకూరులోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని శుక్రవారం పరిశీ లించారు. ముందుగా విద్యార్థుల హాజరు శాతాన్ని, ఉదయం తీసుకున్న అల్పాహారం గురించి అడిగి తెలుసుకున్నారు. డీఈవో మాట్లాడుతూ ఉపాధ్యాయులు పనివేళలు పాటించాలని, స్థానికంగా నివాసం ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Jul 17 , 2026 | 11:24 PM