Share News

విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Jun 26 , 2026 | 12:16 AM

మాదక ద్రవ్యాల పట్ల ముఖ్యంగా విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి కోరారు.

విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి
ప్రసంగిస్తున్న బి. లీలా వెంకట శేషాద్రి

కర్నూలు లీగల్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): మాదక ద్రవ్యాల పట్ల ముఖ్యంగా విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి కోరారు. మాదక ద్రవ్యాల దుర్విని యోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం స్థానిక ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ఓ కార్యక్రమం జరిగింది. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీ యంగా ప్రజలందరూ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారని, విద్యార్థులు కూడా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా నిలబడి, ఇతరులను కూడా ఆలోచింపజేసి తమ వంతు సహాయ సహకారాలను అందించాలని ఆయన విద్యార్థుల ను సూచించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ ఇందిరాశాంతి మాట్లాడుతూ మత్తు పదార్థాలకు బానిసలు కావడంతో వారి కుటుంబ సభ్యులు మనోవేదనకు గురవుతున్నారని అన్నారు. ఈగల్‌ టీమ్‌ ఆఫీసర్‌ ఎలీషా మాట్లాడుతూ ఈ డ్రగ్స్‌ మాఫియాలు విద్యాసంస్థలను, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో లీగల్‌ ఎయిడ్‌ మెంబర్‌ డా. రాయపాటి శ్రీనివాస్‌, సీనియర్‌ సిటిజన్‌ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌ రయిస్‌ ఫాతిమా, వైస్‌ ప్రిన్సిపాల్‌ సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - Jun 26 , 2026 | 12:16 AM