విద్యార్థుల ఆకలి కేకలు
ABN , Publish Date - Jun 17 , 2026 | 12:18 AM
పట్టణంలోని ఎద్దుల పాపమ్మ క్రీడా మైదానం వద్ద ఉండే బీసీ బాలుర వసతి గృహంలో రెండు రోజులుగా భోజనం పట్టడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
ఆళ్లగడ్డ బీసీ వసతి గృహంలో భోజనం వండని నిర్వాహకులు
ఆళ్లగడ్డ, జూన్ 16(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఎద్దుల పాపమ్మ క్రీడా మైదానం వద్ద ఉండే బీసీ బాలుర వసతి గృహంలో రెండు రోజులుగా భోజనం పట్టడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈనెల 6వ నుంచి ఇంటర్, 12వ తేదీ నుంచి మిగిలిన తరగతులుఉ ప్రారంభమయ్యాయి. దీంతో విద్యార్థులు వసతి గృహానికి వచ్చారు. అయితే రెండు రోజులుగా అన్నం వండడం లేదని, పలువురు విద్యార్థులు ఇళ్లకు వెల్లిపోయారు
పత్తాలేని వార్డెన్
వసతి గృహం తెరిచిన ప్పటి నుంచి వార్డెన్ హాస్టల్‌కు రాలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇంటర్, 8,9 తరగతుల విద్యార్థులు 12 మంది వసతి గృహానికి రాగా అన్నం వండలేదని, హాస్టల్‌లో చెత్తాచెదారం ఉందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వివరమణ కోరేందుకు వార్డన్‌ను సంప్రదించగా అందుబాటులో రాలేదు. ఈ విషయమై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు