Share News

ప్రైవేట్‌ కళాశాలలో కొట్టుకున్న విద్యార్థులు

ABN , Publish Date - Sep 30 , 2026 | 12:22 AM

కర్నూలు నగరంలోని కళాశాలల్లో ర్యాగింగ్‌ మితిమిరీపోతున్నా.. ఇటు విద్యాసంస్థల యాజమాన్యాలు కానీ, సంబంధిత విద్యాశాఖ అధికారులు గానీ స్పందించడం లేదు. సీనియర్‌ విద్యార్థులు జూనియర్లను వేదించడం పరిపాటిగా మారింది.

ప్రైవేట్‌ కళాశాలలో కొట్టుకున్న విద్యార్థులు
విద్యార్థిని పరామర్శిస్తున్న సంఘం నాయకులు

ఆసుపత్రిలో విద్యార్థికి చికిత్సలు

కర్నూలు ఎడ్యుకేషన్‌, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): కర్నూలు నగరంలోని కళాశాలల్లో ర్యాగింగ్‌ మితిమిరీపోతున్నా.. ఇటు విద్యాసంస్థల యాజమాన్యాలు కానీ, సంబంధిత విద్యాశాఖ అధికారులు గానీ స్పందించడం లేదు. సీనియర్‌ విద్యార్థులు జూనియర్లను వేదించడం పరిపాటిగా మారింది. ఈ ఆఘాయిత్యాలను అరికట్టడంలో వారు పూర్తిగా వైఫల్యం చెందారనే ఆరోపణలు ఉన్నాయి. కర్నూలు గాయత్రీ ఎస్టేట్‌లోని రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన జూనియర్‌ కళాశాల (బైపీసీ క్యాంపస్‌)లో ర్యాగింగ్‌ కలకలం చోటు చేసుకుంది. కళాశాల ప్రాంగణంలో విద్యార్థులు ఆందోళనలు చెందుతుండగా.. తల్లిదండ్రులు ఎప్పుడు ఏమీ జరుగుతుందోనని భయబ్రాంతులకు గురవుతున్నారు. ఆ కళాశాలలో ఈ నెల 28న జూనియర్‌ విద్యార్థికి సీనియర్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మరుసటి రోజు మంగళవారం మధ్యాహ్న భోజన అనంతరం సమయంలో జూనియర్‌ విద్యార్థిని సీనియర్లు తమ క్లాస్‌రూమ్‌లోకి పిలిపించుకుని తమ కాళ్లు మొక్కాలని హుకుం జారీ చేశారు. అందుకు బాధిత విద్యార్థి నిరాకరిచడంతో సీనియర్లు ఆగ్రహంతో ఊగిపోయి మొఖంపైన, నోటిపైన, శరీరంపై పిడిగుద్దులు గుద్దారు. నోరు, ముక్కు నుంచి రక్తస్రావం జరగడంతో వదిలిపెట్టారు. అక్కడ ఉన్న ఫ్యాకల్టీ వెంటనే గాయత్రీ ఎస్టేట్‌లోని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన తెలుసుకున్న ఆర్‌ఐవో జి.లాలెప్ప హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి విద్యార్థిని పరామర్శించారు. ఈ సంఘటనపై కళాశాల యాజమాన్యంతో వివరణ కోరేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులోకి రాలేదు. బాధిత విద్యార్థిని ఏఎస్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు ఆసుపత్రిలో పరామ ర్శించారు. సంఘటనకు బాధ్యులైన కళాశాల గుర్తింపును రద్దు చేయాలని ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రంగస్వామి, వీరేష్‌, ఏఐవైఎఫ్‌ నాయకులు శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు.

Updated Date - Sep 30 , 2026 | 12:22 AM