Share News

ప్రభుత్వ పనుల్లో విద్యార్థులు

ABN , Publish Date - Mar 17 , 2026 | 12:08 AM

చక్కగా చదువుకోవాల్సిన విద్యార్థులు కూలీలుగా మారారు. ప్రభుత్వం చేపట్టే పనుల్లో విద్యార్థులను పనిలో పెట్టుకోకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్న ఐడీసీ అధికారులకు అవేమీ పట్టడం లేదు.

ప్రభుత్వ పనుల్లో విద్యార్థులు
రాంపురం ఐడీసీ పంప్‌హౌ్‌సపై పనిచేస్తున్న 9వ తరగతి విద్యార్థి

ఐడీసీ పంపుహౌస్‌ పనుల్లో మగ్గుతున్న బాల్యం

పట్టించుకోని అధికారులు

మంత్రాలయం, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): చక్కగా చదువుకోవాల్సిన విద్యార్థులు కూలీలుగా మారారు. ప్రభుత్వం చేపట్టే పనుల్లో విద్యార్థులను పనిలో పెట్టుకోకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్న ఐడీసీ అధికారులకు అవేమీ పట్టడం లేదు. దీంతో చిన్నవయసులోనే చేయలేని పనుల్లో బాల్యం మగ్గిపోతోంది. మంత్రాలయం మండలంలోని రాంపురం సమీపంలో తుంగభద్ర నదిఒడ్డున రూ.10కోట్ల ఖర్చుతో పంప్‌ హౌస్‌ నిర్మాణ పనులు చేపట్టారు. ఇందులో నందవరం మండలానికి కనకవీడు గ్రామానికి తొమ్మిదో తరగతి విద్యార్థి, ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు పనులు చేస్తున్నారు. ముగ్గురు విద్యార్థులను ఐదు నెలలుగా చదువులు మాన్పించి ఐడీసీలో పంప్‌హౌస్‌ పనులకు తల్లిదండ్రులతో పాటు తీసుకెళ్తున్నారు. విద్యార్థులతో పనిచేయించకూడదని ప్రభుత్వ ఆదేశాలున్న ఐడీసీ అధికారులు ఉన్నత అధికారుల ఆదేశాలను బేఖాతర్‌ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యార్థులను పని మాన్పించి చదువుబాట పట్టే విధంగా చూడాల్సిన భాధ్యత అధికారులపై ఉంది. ఇంటర్‌ విద్యార్థులు పరీక్షకు హాజకు కాకుండా పనులకు వెళ్తున్నారు. తొమ్మిదో తరగతి విద్యార్థి మాట్లాడుతూ.. తనకు చదువుకోవాలని ఉందని, అయితే తన తల్లిదండ్రులు మాత్రం పనికి పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతా ఒకే కుటుంబ సభ్యులతో కలిసి పంప్‌హస్‌ పనులకు వెళ్తున్నట్లు తెలిపారు. బడికి వెళ్తానంటే వినడం లేదని, చదువురాదని, జులాయిగా తిరుగుతావని డుతూ పనికి పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

పిల్లలను పనిలో పెట్టుకోవద్దని చెప్పాం

చదువుకునే విద్యార్థులను, బాలకార్మికులను పనిలో పెట్టుకోవద్దని కంపెనీ సిబ్బందికి చెప్పాం. ఎప్పుడో పాఠశాలలకు సెలవురోజుల్లో పనికి వస్తున్నారో..ఏమో తెలియదు. మేము పంప్‌హౌస్‌ దగ్గరకు పనుల పరిశీలను వెళ్లేటప్పుడు విద్యార్థులు కనిపించడం లేదు. విద్యార్థులను వెంటే పని మాన్పించి చదువుకునేలా ప్రోత్సహిస్తాం. - సుమన్‌, ఏఈ, ఐడీసీ, మంత్రాలయం

Updated Date - Mar 17 , 2026 | 12:08 AM