Share News

విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి

ABN , Publish Date - Sep 24 , 2026 | 12:20 AM

పట్టణంలోని బస్టాండు సర్కిల్‌లో విద్యుదాఘాతంతో విద్యార్థి తోక నిఖిల్‌(13) బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. విద్యార్థి స్వగ్రామం కొలిమిగుండ్ల మండలం బెలుం. అవుకు పట్టణం బనగానపల్లెకు వెళ్లే రహదారిలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో నిఖిల్‌ 8వ తరగతి చదువుతూ స్కూల్‌కు చెందిన హాస్టల్‌లోఉంటున్నాడు

విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి
మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ, ఇన్ సెట్ లో నిఖిల్‌ (ఫైల్‌)

అవుకు, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని బస్టాండు సర్కిల్‌లో విద్యుదాఘాతంతో విద్యార్థి తోక నిఖిల్‌(13) బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. విద్యార్థి స్వగ్రామం కొలిమిగుండ్ల మండలం బెలుం. అవుకు పట్టణం బనగానపల్లెకు వెళ్లే రహదారిలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో నిఖిల్‌ 8వ తరగతి చదువుతూ స్కూల్‌కు చెందిన హాస్టల్‌లోఉంటున్నాడు. సీసీ పుటేజ్‌ ఆధారంగా సీఐ మంజునాథరెడ్డి తెలిపిన వివరాల మేరకు హాస్టల్‌ నుంచి పాఠశాల యాజమాన్యం కళ్లుగప్పి ముగ్గురు విద్యార్థులతో కలసి తెల్లవారుజామున 2.15 గంటలకు నిఖిల్‌ బయటకు వచ్చాడు. మార్కెట్‌ వీధి మీదుగా నలుగురు విద్యార్థులు బస్టాండు సర్కిల్‌కు చేరుకున్నారు. అక్కడ విద్యుదాఘాతానికి గురై నిఖిల్‌ మృతి చెందాడు. స్నేహితులు ముగ్గురు భయపడి ఏమీ తెలియనట్లు హాస్టల్‌కు చేరుకున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి నిఖిల్‌ మృతదేహాన్ని అవుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తండ్రి కంబగిరి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.

Updated Date - Sep 24 , 2026 | 12:20 AM