Share News

పటిష్ట భద్రత

ABN , Publish Date - Mar 21 , 2026 | 11:35 PM

రంజాన్‌ పండుగ పురస్కరించుకుని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ఆదేశాల మేరకు మసీ దులు, ఈద్గాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

పటిష్ట భద్రత
ఈద్గాలో బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీ

కర్నూలు క్రైం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): రంజాన్‌ పండుగ పురస్కరించుకుని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ఆదేశాల మేరకు మసీ దులు, ఈద్గాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. బాంబు స్క్వాడ్‌ బృందాలు, పోలీసు జాగిలాలతో తనిఖీలు చేసి కట్టుదిట్టం చేశారు. పండుగ వేళ ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ బందోబస్తు విధులు నిర్వహించారు. ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలు చేపట్టారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా, ముస్లింలు రంజాన్‌ పండుగను ప్రశాంతంగా జరుపుకునేలా అన్ని చర్యలు తీసుకున్నారు.

Updated Date - Mar 21 , 2026 | 11:35 PM