పటిష్ఠ భద్రత
ABN , Publish Date - Jan 26 , 2026 | 12:01 AM
గణతంత్ర వేడుకలకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు.
గణతంత్ర రిహార్సల్స్ పరిశీలించినఏఎస్పీ
కర్నూలు క్రైం/ కలెక్టరేట్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): గణతంత్ర వేడుకలకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. ఆదివారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలోని పెరేడ్ మైదానంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల రిహార్సల్స్, కవాత్‌లను అడిషినల్ ఎస్పీ హుసేన్‌పీరా, కృష్ణమోహన్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా జాతీయ పతాకావిష్కరణ, అతిథుల గ్యాలరీలు, స్టాల్స్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ వేడుకలకు అతిథులు, ప్రముఖులు, విద్యార్థులు హాజ రు అవుతుండటంతో అన్నిరకాల భద్రతా చర్యలు తీసుకోవాలని ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, వాహనాల పార్కింగ్ అంశాలపై పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో హోంగార్డు డీఎస్పీ ప్రసాద్, ఆర్‌ఐలు, ఆర్‌ఎ్‌సఐలు, సివిల్, ఏఆర్‌ఎన్‌సీసీ, స్కౌట్ విద్యార్థులు పాల్గొన్నారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా ఉదయం 9 గంటలకు పోలీస్ ప రేడ్ మైదానంలో కలెక్టర్ డా.ఏ.సిరి ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీ య పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. పోలీసు సాయుధ దళాల పరేడ్ పరిశీలించి గౌరవ వందనం స్వీకరిస్తారు.