Share News

వంద శాతం ఉత్తీర్ణతకు కృషి చేయండి

ABN , Publish Date - Sep 10 , 2026 | 11:10 PM

రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, జడ్పీ ఉన్నత పాఠశాలల్లో పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేయాలని విద్యా శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ మువ్వ రామలింగం అన్నారు.

వంద శాతం ఉత్తీర్ణతకు కృషి చేయండి
మాట్లాడుతున్న విద్యా శాఖ జేడీ మువ్వ రామలింగం

విద్యా శాఖ జేడీ మువ్వ రామలింగం

మంత్రాలయం, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, జడ్పీ ఉన్నత పాఠశాలల్లో పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేయాలని విద్యా శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ మువ్వ రామలింగం అన్నారు. గురువారం మండలంలోని మాధవరం జడ్పీహెచ్‌ఎ్‌ విద్యానగర్‌ ఎస్‌ఎంకేవీ ప్రభుత్వ పాఠాశాలలను ఎంఈవోలు రాగన్న, నాగభూషణం ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. పాఠశాల గదులు, విద్యా బోధన, ఉ పాధ్యాయులు, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం, మౌలిక సదుపాయాలను పరిశీ లించారు. రామచంద్రనగర్‌ ప్రాథమిక పాఠశాలలో మండలంలోని హెచ్‌ఎంలతో పాఠశాలల అభివృద్ధిపై ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడారు. గత ప్రభుత్వంలో నాడు-నేడు కింద నిలిచిపోయిన భవనాలను పునఃనిర్మాణానికి నాబార్డు ద్వారా నిధులు మంజూరు చేయిం చి వెంటనే పనులు ప్రారంభించేందుకు ఆదేశాలిచ్చామన్నారు. పదవ తరగతి విద్యార్థులతో విద్యా బోధనపై అడిగి తెలుసుకున్నారు. క్రీడల్లో విజ యం సాధించిన విద్యార్థులను అభినందించారు. జేడీకి ఆయా గ్రామస్థులు అదనపు గదులు కావాలని వినతిపత్రాలను అందజేశారు. శాలువాకప్పి పూలమాలతో సన్మానించారు. కార్యక్రమంలో హెచ్‌ఎంలు బోజరాజు, లచ్చప్ప, సుజాత, మోడల్‌స్కూల్‌ ప్రిన్సిపాల్‌ అశోక్‌ నాయక్‌, వీరేష్‌, చంద్రశేఖరాచార్‌, సుధాకర్‌, రామ్మోహన్‌, రామాంజనేయులు, విఠోభరావు, లక్ష్మీకాంతం, ప్రాణే్‌షఆచార్‌, నాగభూషణం, అరుణాదేవి, వెంకటేశ్వర్లు, భీమన్న, సీఆర్‌పీలు నర్సన్నగౌడు, బంగారప్ప, భీమేష్‌, దేవేంద్రప్ప, రాజశేఖర్‌, కళ్యాణి, శివకుమార్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Sep 10 , 2026 | 11:10 PM