జూనియర్ డాక్టర్ల సమ్మె నోటీసు
ABN , Publish Date - Aug 09 , 2026 | 11:19 PM
కేఎంసీ (కర్నూలు మెడికల్ కాలేజీ)లో ఉన్న హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్‌కు జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ సమ్మె నోటీసు అందజేసింది.
కర్నూలు హస్పిటల్, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): కేఎంసీ (కర్నూలు మెడికల్ కాలేజీ)లో ఉన్న హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్‌కు జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ సమ్మె నోటీసు అందజేసింది. జూనియర్ డాక్టర్లు సమ్మెలోకి వెళితే రోగులకు సౌకర్యాలు, ఏర్పాట్లపై అదివారం జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వర్లు అత్యవసర సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సూపరింటెండెంట్ డా.నాగేశ్వరరావు, సీఎ్‌సఆర్‌ఎం డా.పద్మజ, డిప్యూటీ సీఎ్‌సఆర్‌ఎం డా.పద్మజ, ఆర్‌ఎంవో డా. టీసీహెచ్ వెంక టరమణ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్ అసోసియేట్ ప్రొఫెసర్ డా.రామాంజినేయు పాల్గొన్నారు. డీఎంహెచ్‌వో, డీసీహెచ్‌ఎ్‌స అధికారులతో మాట్లాడారు. ఒకవేళ జూనియర్ డాక్టర్లు సమ్మెలోకి వెళితే కర్నూలు జీజీహెచ్‌కు 17 మంది వైద్యులు కావాలని అడిగినట్లు సూపరింటెండెంట్ తెలిపారు. రోగులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జూనియర్ డాక్టర్ల బదులుగా సీనియర్ వైద్యులతో ఓపీ సేవలను నిర్వహిస్తామన్నారు.
న్యాయమైన డిమాండ్లను..
తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ఏపీ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు డానిషాంత్ తెలిపారు. సోమవారం సాయం త్రం వైద్యశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ, డీఎంఈతో జూనియర్ డాక్టర్ల ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారని, ఉదయం 8నుంచి 9 గంటల వరకు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతామని తెలిపారు.