Share News

పాగాలంకరణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు : కలెక్టర్‌, ఎస్పీ

ABN , Publish Date - Feb 13 , 2026 | 11:17 PM

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన పాగాలంకరణకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్‌ రాజకుమారి, ఎస్పీ సునీల్‌షెరాన్‌ తెలిపారు.

పాగాలంకరణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు : కలెక్టర్‌, ఎస్పీ
పాగాలంకరణ ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌, ఏస్పీ

శ్రీశైలం, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన పాగాలంకరణకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్‌ రాజకుమారి, ఎస్పీ సునీల్‌షెరాన్‌ తెలిపారు. శుక్రవారం పాగాలంకరణ కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్‌న్లు, భక్తుల రాకపోకల మార్గాలను, భద్రతా చర్యలను సమగ్రంగా తనిఖీ చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. పాగాలంకరణ సమయంలో రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున ట్రాఫిక్‌ నియంత్రణ, పార్కింగ్‌ ఏర్పాట్లు, భద్రత వంటి విషయాల్లో పోలీస్‌ శాఖతో సమన్వయంతో ముందుకు వెళ్ళాని అధికారులను కలెక్ట్‌ర్‌ సూచించారు. కమాండ్‌ కంట్రోల్‌ రూం ద్వారా పరిస్థితులను నిరంతరం పరిశీలించాలన్నారు.

Updated Date - Feb 13 , 2026 | 11:21 PM