అలసత్వం వహిస్తే కఠిన చర్యలు
ABN , Publish Date - Sep 02 , 2026 | 11:09 PM
అలసత్వం వహిస్తే కఠిన చర్యలు
కలెక్టర్ రాజకుమారి
నంద్యాల నూనెపల్లి, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాల్లో చేపట్టిన మౌలిక వసతుల అభివద్ధి పనుల పురోగతిలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాజకుమారి అధికారులను హెచ్చరించారు. బుధవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి ‘మనబడి- మన భవిష్యత్’ కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రాష్ట్రస్థాయి ర్యాంక్‌లలో జిల్లా పనితీరు మెరుగుపడేలా అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. వివరాలను పోర ్టర్లలో నమోదు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు.
సర్ ప్రక్రియ పొడిగింపు
సర్ ప్రక్రియలో బాగంగా చేపట్టిన ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, దరఖాస్తుల స్వీకరణ ఈనెల 10వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజకుమారి తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ అభ్యంతరాలు, దరఖాస్తుల పరిష్కారం అక్టోబరు 5వతేదీ వరకు కొనసాగుతుందన్నారు. అక్టోబరు 9న తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తామన్నారు.