Share News

నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

ABN , Publish Date - Apr 10 , 2026 | 11:00 PM

జిల్లాలో తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ డా.ఏ.సిరి అధికా రులను హెచ్చరించారు.

నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
మాట్లాడుతున్న కలెక్టర్‌ డా.ఏ. సిరి

కలెక్టర్‌ డా.ఏ. సిరి

కర్నూలు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ డా.ఏ.సిరి అధికా రులను హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్‌ సునయన ఆడిటో రియంలో తాగునీరు, పారిశుధ్యం, అంశాలపై అన్ని మండలాల ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు, ఆర్‌ డబ్ల్యూఎస్‌ శాఖల అధికా రులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ తుంగభద్ర డ్యాం నుంచి జనవరి 20వరకు నీటిని విడుదల చేయడంతో సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకులు, మైనర్‌ ఇరిగేషన్‌ ట్యాంకులు నింపుకున్నామన్నారు. మార్చి 20వ తేదీ నుంచి మళ్లీ నీటి విడుదల ప్రారంభమైనందున ట్యాంకులను నింపుతున్నా మని ఆగస్టు చివరి వరకు నీటి కొరత ఉండదని భావిస్తున్నామన్నారు. ఓహెచ్‌ఆర్‌ఎస్‌ ట్యాంకులపై క్లోరినేషన్‌ ఎప్పుడు చేశారు.. బ్లీచింగ్‌ ఎప్పుడు వేశారనే తేదీలు కచ్చితంగా రాయాలని, ఖాళీగా ఉన్న బోర్డులు కనిపిస్తే బాధ్యులపై చర్యలు ఉంటాయన్నారు. ఆర్‌ డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ మనోహర్‌, జడ్పీ సీఈవో రమణారెడ్డి, డీఎంహెచ్‌వో డా. కామేశ్వర ప్రసాద్‌, ఐసీడీఎస్‌ పీడీ విజయ, డీపీవో భాస్కర్‌, డీఆర్‌డీఏ పీడీ రమణారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 10 , 2026 | 11:00 PM