Share News

కుక్కలు బాబోయ్‌..!

ABN , Publish Date - Sep 08 , 2026 | 12:26 AM

మండలంలోని పేరుసోముల గ్రామంలో వీధికుక్కలు వీరంగం సృష్టిస్తున్నాయి. రెండు రోజులక్రితం గాండ్ల సుబ్బమ్మ అనే వృద్ధురాలిని వెంబడించడంతో ఆమె కాలువలోపడి కాలు విరిగింది. కుక్కలు రోడ్లపై తిష్టవేసి పిల్లలను, వృద్ధుల వెంటపడుతుండటంతో వారు హడలిపోతున్నారు.

కుక్కలు బాబోయ్‌..!
పేరుసోములలో వీధి కుక్కల సమూహం ట

పేరుసోములలో వృద్ధురాలిపై దాడి

పట్టించుకోని అధికారులు

సంజామల, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): మండలంలోని పేరుసోముల గ్రామంలో వీధికుక్కలు వీరంగం సృష్టిస్తున్నాయి. రెండు రోజులక్రితం గాండ్ల సుబ్బమ్మ అనే వృద్ధురాలిని వెంబడించడంతో ఆమె కాలువలోపడి కాలు విరిగింది. కుక్కలు రోడ్లపై తిష్టవేసి పిల్లలను, వృద్ధుల వెంటపడుతుండటంతో వారు హడలిపోతున్నారు.

కోళ్లు, జీవాలపై దాడులు

వీధి కుక్కలు కోళ్లపై దాడిచేసి వాటిని తినేస్తున్నాయని పెంపకందారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ పదుల సంఖ్యలో కోళ్లను తినివస్తున్నాయంటున్నారు. అలాగే గొర్రెలు, మేకలపై కూడా దాడులు చేస్తున్నట్టు పోషకులు ఆందోళన చెందుతున్నారు. గ్రామ పంచాయతీ అధికారులు వీధికుక్కలను ఇక్కడి నుంచి తరలించి తమను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.

అధికారులు పట్టించుకోవడం లేదు

వీధి కుక్కలు దాడులు చేస్తున్నా పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇటీవల పిల్లలు, పెద్దలు, కోళ్లు, జీవాలపై దాడులు చేస్తున్నాయి. తమ పిల్లలను పాఠశాలకు పంపాలంటే తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. - పెద్దన్న, పేరుసోముల

Updated Date - Sep 08 , 2026 | 12:27 AM