Share News

భౌ..బోయ్‌ కుక్కలు

ABN , Publish Date - Aug 21 , 2026 | 11:58 PM

నగర పంచాయితీ పరిధిలోకుక్కలు స్వైర్య విహారం చేస్తూ దాడులకు పాల్పడుతున్నాయి. ఇటీవలే పట్టణంలోని హానుమాన్‌నగర్‌ కాలనీకి చెందిన బాలుడు మహిర్‌(6)పై శుక్రవారం దాడిచేసి విచక్షణారహితంగా గాయపరిచాయి.

భౌ..బోయ్‌ కుక్కలు
బేతంచెర్లలో సంచరిస్తున్న వీధి కుక్కలు

బేతంచెర్లలో శుక్రవారం బాలుడిపై దాడి.. తీవ్ర గాయాలు

దాడులతో ఆందోళనపడతున్న వాహనదారులు

బేతంచెర్ల, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): నగర పంచాయితీ పరిధిలోకుక్కలు స్వైర్య విహారం చేస్తూ దాడులకు పాల్పడుతున్నాయి. ఇటీవలే పట్టణంలోని హానుమాన్‌నగర్‌ కాలనీకి చెందిన బాలుడు మహిర్‌(6)పై శుక్రవారం దాడిచేసి విచక్షణారహితంగా గాయపరిచాయి. అక్కడే ఉన్న మహబూబ్‌ బాషా అనే వ్యక్తి బాలుడిని విడిపించి, బాలుడి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో బేతంచెర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి ప్రథమ చికిత్స అనంతరం కర్నూలుకు తరలించారు. గతేడాది మే నెలలో అదే గ్రామ సచివాలయం సమీపంలో హనుమాన్‌ నగర్‌కు చెందిన బాలుడిని చంపివేయడంతో పట్టణవాసులు ఆందోళన చెందుతున్నారు. గత జూన్‌లో కూడా మరొక బాలుడిపై కూడా దాడిచేశాయి. 2025 మే నుంచి ఇప్పటి వరకు నెలకు 80 నుంచి 90 మంది పిల్లలు కుక్కకాటు బాధితుల కేసులో ఆసుపత్రిలో నమోదయ్యాయి. ఏడాదిన్నరలోనే పట్టణంలో 1,500మంది కుక్కకాటుకు గురయ్యారు.

పట్టించుకోని అధికారులు

కుక్క కాటు నుంచి తమను కాపాడాలని పట్టణ ప్రజలు నగర పంచాయతీ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. పట్టణంలో ఏ వీధిలో చూసిన కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగతున్న పట్టించుకోవడం లేదని పట్టణ ప్రజలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. రాత్రివేళల్లో రోడ్ల వెంట వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..

కుక్కల బెడదతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. పట్టణంలోని పాత బస్టాండ్‌లో రోడ్లపై తిరుగుతుండడంతో ద్విచక్ర వాహనాదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళుతున్నారు. ఇప్పటికైనా కుక్కలను నగర పంచాయతీ అధికారులు కుక్కలను ఊరిబయట వదిలిపెట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

విషయమై నగర పంచాయతీ కమిషనర్‌ హరి ప్రసాద్‌ వివరణ కోరగా కుక్కల నివారణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అధికారులు విఫలం

వీధి కుక్కలను నియంత్రించడంలో నగర పంచాయతీ అధికారులు విఫలమయ్యారని సిపీఐ, సీపీఎం నాయకులు భార్గవ్‌, ఎల్లయ్య ఆరోపించారు. శుక్రవారం హనుమాన్‌ నగర్‌ లో ఆరేళ్ల బాలుడిపై కుక్కలు దాడిచేయడం కలచివేందని, అధికారులు స్పందించాలని కోరారు. ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌ నాయకులు ఉదయ్‌, చైతన్య, సీఐటియు టౌన్‌ నాయకులు ఖాజా భాష, రామకృష్ణ, ఎస్‌కె భాష, టింగు పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2026 | 11:58 PM