Share News

భౌబోయ్‌

ABN , Publish Date - Jul 25 , 2026 | 11:41 PM

పట్టణంలో వీధి కుక్కల బెడద అధికంగా ఉంది. ప్రధాన రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలు, వీధుల్లో గుంపులుగా సంచరిస్తూ వాహనదారులు, పాదచారులపై దాడులకు పాల్పడుతున్నాయి. పట్టణంలో 700పైగా వీధి కుక్కలు వున్నట్లు అధికారులు తెలిపారు.

భౌబోయ్‌
ప్రభుత్వ కార్యాలయాల వద్ద సంచరిస్తున్న వీధి కుక్కలు

డోన్‌లో 700కు పైగా వీధి కుక్కలు.. వాహనదారులపై దాడులు

హడలిపోతున్న ప్రజలు

డోన్‌ రూరల్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో వీధి కుక్కల బెడద అధికంగా ఉంది. ప్రధాన రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలు, వీధుల్లో గుంపులుగా సంచరిస్తూ వాహనదారులు, పాదచారులపై దాడులకు పాల్పడుతున్నాయి. పట్టణంలో 700పైగా వీధి కుక్కలు వున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రభుత్వ కార్యాలయాల వద్ద సైతం..

వీధి కుక్కలు రోడ్లపైకి మాత్రమే కాకుండా ప్రభుత్వ కార్యాలయల వద్ద సైతం తిష్టవేయడంతో అక్కడికి వచ్చే ప్రజలు, సిబ్బంది బెంబేలెత్తుతున్నారు. పట్టణంలోని పోలీస్‌ స్టేషన్‌ రోడ్డు, సుందర్‌సింగ్‌ కాలనీ, కొండపేట ప్రాంతాల్లో కుక్కల బెడద అధికంగా ఉన్నట్లు స్థానిరులు అంటున్నారు. తరుచుగా ప్రజలపై దాడులు చేస్తుండటంతో డోన్‌ ప్రభుత్వ ఆసుపత్రికి నెలకు 50కి పైగా కుక్క కాటు సంబందించిన కేసులు నమోదవుతున్నాయని ఆసుపత్రి సిబ్బంది తెలుపుతున్నారు. మున్సిపల్‌ అధికారులు స్పందించి వీధి కుక్కలను తరలించాలని స్థానికులు కోరుతున్నారు.

కుక్కలతో ఇబ్బందులు

పట్టణంలో ప్రధాన వీధుల, ప్రధాన రోడ్లపై వీధి కుక్కల బెడద అధికంగా ఉంది. గుంపులుగా ఉండి, ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయి. మున్సిపల్‌ అధికారులు స్పందించి వీధి క్కులను తరలించాలి. - రణత్‌ యాదవ్‌, సుందర్‌సింగ్‌ కాలనీ

శస్త్ర చికిత్స చేయిస్తున్నాం

పట్టణంలో 700పైగా వీది కుక్కలు ఉన్నట్లు గుర్తించాము. ఇప్పటికే 300 కుక్కలను కర్నూలుకు తరలించి కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేయించి వాటిని యథాస్థానంలో వదిలిపెట్టాం. మరో 400 కుక్కలకు కూడా తర్వలో శస్త్రచికిత్స చేయిస్తాం. - ప్రసాద్‌గౌడ్‌, మున్సిపల్‌ కమిషనర్‌

Updated Date - Jul 25 , 2026 | 11:41 PM