ఏకగ్రీవానికి చెక్
ABN , Publish Date - Oct 17 , 2026 | 11:41 PM
మండలంలోని గుంజలపాడు గ్రామపంచాయతీ మొదట్లో కోవెలకుంట్ల పట్టణంలోని 16వ వార్డులో ఉండేది. నాటి ఉప ముఖ్యమంత్రి బీవి సుబ్బారెడ్డి సహకారంతో గ్రామ నాయకుడు ముక్కమల్ల గోపాల్ రెడ్డి గుంజలపాడును 1970లో గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయించారు.
గుంజలపాడు గ్రామ పంచాయతీకి ఈ దఫా ఎన్నికలు నిర్వహించే అవకాశం
50ఏళ్లలో ఒక్కసారే ఎన్నికలు
కోవెలకుంట్ల, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): మండలంలోని గుంజలపాడు గ్రామపంచాయతీ మొదట్లో కోవెలకుంట్ల పట్టణంలోని 16వ వార్డులో ఉండేది. నాటి ఉప ముఖ్యమంత్రి బీవి సుబ్బారెడ్డి సహకారంతో గ్రామ నాయకుడు ముక్కమల్ల గోపాల్ రెడ్డి గుంజలపాడును 1970లో గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయించారు. అయితే మొదటిసారి ముక్కమల్ల గోపాల్ రెడ్డిని సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రెండోసారి ఎన్నికల్లో గోపాల్ రెడ్డిపై ఈశ్వర్ రెడ్డి సర్పంచ్‌గా గెలిచారు. అనంతరం ఈశ్వర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక అప్పటి నుంచి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇక్కడ మాత్రం ఏకగ్రీవాలు నమోదయ్యాయి. గుంజలపాడు గ్రామంలో మొత్తం 614 మంది ఓటర్లు ఉండగా పురుషులు 295మంది, మహిళలు 319 మంది ఉన్నారు. 2021 ఎన్నికల్లో ఓసీ మహిళకు రిజర్వ్ కాగా ఏకగ్రీవమైంది. ఇందులో కె. రాధ 2.6 సంవత్సరాలు, ఎం.రజని 2.6 సంవత్సరాలు ఉండేలా ఒప్పందం చేసుకున్నారు. కాగా 2026లో ఓసీ జనరల్‌కు రిజర్వ్ చేయడంతో టీడీపీ, వైసీపీలు పోటీ పడుతున్నాయి. కాగా ఈ దఫా ఎన్నిక నిర్వహించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.