Share News

ఆగని ప్రవాహానికి అడ్డుకట్ట

ABN , Publish Date - Feb 20 , 2026 | 12:16 AM

కేసీ కాలువ ఆయకట్టు రైతుల జీనవాడి రక్షణ కవచమైన సుంకేసుల బ్యారేజీ గేట్ల మరమ్మతు లకు శ్రీకారం చుట్టారు.

ఆగని ప్రవాహానికి అడ్డుకట్ట
సుంకేసుల బ్యారేజీ గేట్ల మరమ్మతు పనుల్లో సిబ్బంది

ఎట్టకేలకు సుంకేసుల బ్యారేజీ గేట్ల మరమ్మతులు

శిథిలమైన రబ్బరు సీల్స్‌ ఏర్పాటు

తొలి రోజు రెండు గేట్ల మరమ్మతులు పూర్తి

కర్నూలు, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): కేసీ కాలువ ఆయకట్టు రైతుల జీనవాడి రక్షణ కవచమైన సుంకేసుల బ్యారేజీ గేట్ల మరమ్మతు లకు శ్రీకారం చుట్టారు. గురువారం జలవనరుల శాఖ ఎస్‌ఈ బాలచం ద్రారెడ్డి, కేసీ కెనాల్‌ డీఈఈ ప్రసాద్‌రావు పర్యవేక్షణలో మరమ్మతు పనులకు శ్రీకారం చుట్టారు. తొలిరోజు రెండు గేట్ల మరమ్మతులు పూర్తి చేశారు. లీకేజీలు లేకుండా శిథిలమైన రబ్బర్‌ సీల్స్‌ తొలగించి వాటి స్థాన ంలో కొత్త రబ్బర్‌ సీల్స్‌ ఏర్పాటుచేస్తున్నారు. జలాశయంలో పుష్కలంగా నీళ్లు ఉన్నా.. గేట్ల మరమ్మతు టెక్నికల్‌ సిబ్బంది ప్రాణాలకు తెగించి పనులు చేస్తున్నారు. కర్నూలు మండలం సుంకేసుల సమీపంలో తుంగ భద్ర నదిపై నిర్మించిన కోట్ల విజయభాస్కరెడ్డి (సుంకేసుల) బ్యారేజీ రాయలసీమ జిల్లాల్లో అతిప్రాచీనమైనది. తుంగభద్ర-పెన్నా నదులను అనుసంధానం చేస్తూ నావిగేషన (జల రవాణా) లక్ష్యంగా 1861లో పనులు చేపట్టి 1863-1870 మధ్య నిర్మాణాలు పూర్తి చేశారు. 165 ఏళ్ల చరి త్ర కలిగిన కేసీ కాలువను ‘ప్రపంచ వారసత్వ నీటిపారుదల కట్టడం (వరల్డ్‌ హెరిటేజ్‌ ఇరిగేషన స్ట్రర్చర్‌)గా అంతర్జాతీయ గుర్తింపు లభించింది.

15 ఏళ్లకు పైగా శిథిలమైన రబ్బరు సీల్స్‌..

15 ఏళ్లకు పైగా శిథిలమైన రబ్బరు సీల్స్‌ మరమ్మతులు చేయకపో వడం వల్ల గేట్ల నుంచి వచ్చే లీకేజీలతో తుంగభద్ర జలాలు వృథాగా దిగువకు వెళ్తు న్నాయి. 2009 నాటి వరద లకు డ్యాం మట్టి ఆనకట్ట కొట్టుకుపోయింది. జలాశయం సహా కేసీ కాలువ ఛిద్ర మైంది. అప్పటి నుం చి తాత్కాలిక మర మ్మతులతో నెట్టుకొ ట్టుస్తున్నారే తప్ప శాశ్వత మరమ్మతులపై దృష్టి సారించ లేదు. ప్రాజెక్టుకు 30 రేడియల్‌ గేట్లు ఏర్పాటుచేశారు. 2009 వరదలకు మొత్తం గేట్లు దెబ్బతింటే.. 14 గేట్లు మాత్రం మరమ్మతులు చేశారు. 15 గేట్లు మరమ్మతులకు నోచుకోలేదు.

రబ్సరు సీల్స్‌ సందుల మధ్య నుంచి..

రబ్బరు సీల్స్‌ శిథిలం అవ్వడంతో గేట్లన్నీ మూసేసినా గేట్ల రబ్బరు సీల్స్‌ సందుల మధ్య నుంచి 100-150 క్యూసెక్కులు నీరు దిగువకు వదిలేయాల్సిన వస్తుంది. ప్రస్తుతం జలా శయంలో 0.995 టీఎంసీల నీటి నిల్వ ఉంది. లీకేజీల వల్ల రోజుకు వంద క్యూసెక్కులకు పైగా వృథా అవుతుండడంతో వేసవిలో కర్నూలు నగరం తాగునీటి సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నగరానికి పొంచి ఉన్న తాగునీటి ముప్పుపై ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తెచ్చింది. ఎట్టకేలకు మంత్రి టీజీ భరత, జిల్లా యంత్రాంగం స్పందించారు. గేట్ల మరమ్మతులు చేపట్టారు. వారం పది రోజుల్లోగా మరమ్మతులు పూర్తి చేసి వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని ఇంజనీర్లు తెలిపారు.

Updated Date - Feb 20 , 2026 | 12:16 AM