మొండి బకాయిలపై కఠినంగా వ్యవహరించాలి
ABN , Publish Date - Jan 19 , 2026 | 12:07 AM
నగరంలో దీర్ఘకాలికాలికంగా పెండింగ్ ఉన్న ఆస్తిపన్ను మెండి బకాయిలపై ఇకపై కఠినంగా వ్యవహరించాలని కమిషనర్ పి.విశ్వనాథ్ అధికా రులను ఆదేశించారు.
నగర పాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్
కర్నూలు న్యూసిటీ, జనవరి 18(ఆంధ్రజ్యోతి): నగరంలో దీర్ఘకాలికాలికంగా పెండింగ్ ఉన్న ఆస్తిపన్ను మెండి బకాయిలపై ఇకపై కఠినంగా వ్యవహరించాలని కమిషనర్ పి.విశ్వనాథ్ అధికా రులను ఆదేశించారు. ఆదివారం రెవెన్యూ, ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక విభాగాల అధికారులతో పన్ను వసూళ్ల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనులకు నిధుల లభ్యత కీలకమని స్పష్టం చేశారు. మొండి బకాయిదారుల జాబితా సిద్ధం చేసి, అవస రమైతే వారి ఆస్తుల జప్తుకు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు మూడు బృందాలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అడిషనల్ కమిషనర్ ఆర్‌జీవి.కృష్ణ, కార్యదర్శి నాగరాజు, ఎస్‌ఈ జే.రమణమూర్తి, రెవెన్యూ అధికారులు జునైద్, వాజిద్, ఎంహెచ్‌వో నాగప్రసాద్, టీపీవో అంజాధ్ బాషా, సూపరింటెం డెంట్ మంజూర్‌బాషా, తదితరులు పాల్గొన్నారు.