కోర్టు కేసుల పరిష్కారానికి చర్యలు
ABN , Publish Date - Feb 26 , 2026 | 01:03 AM
నగర పాలక సంస్థకు సంబంధించి వివిధ న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల ను త్వరగా పరిష్క రించేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ పి.విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు.
నగర పాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్
కర్నూలు న్యూసిటీ, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): నగర పాలక సంస్థకు సంబంధించి వివిధ న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల ను త్వరగా పరిష్క రించేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ పి.విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన క్యాంపు కార్యాలయంలో కోర్టు కేసుల స్థితి గతులపై అన్ని విభాగాల అధికా రులతో సమీక్ష నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులపై ప్రత్యేక దృష్టి సారించాల న్నారు. కౌంటర్ల దాఖలు, న్యాయస్థానాల ఆదేశాల అమలు వంటి ప్రక్రియ లను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్‌ఈ జే. రమణమూర్తి, ప్రజారోగ్య అధికారి డా. నాగప్రసాద్‌బాబు, ఇంచార్జి సిటీ ప్లానర్ వెంకటరమణ, న్యాయ సలహాదారుడు కృష్ణమూర్తి, సూపరిం టెండెంట్లు సుబ్బన్న, మంజూర్ బాషా, నాగరాజు పాల్గొన్నారు.
స్వచ్ఛ నగరాన్ని నిర్మించుకుందాం: స్వచ్ఛ నగరాన్ని నిర్మించుకో వడంలో అందరూ భాగస్వాములు కావాలని కమిషనర్ పి.విశ్వనాథ్ పిలుపునిచ్చారు. కమిషనర్ బుధవారం తెల్లవారుజా మున నగరంలో పర్యటించారు. ఆయన మాట్లాడుతూ నగరాన్ని స్వచ్ఛతలో ముందం జలో ఉంచాలనే లక్ష్యంతో రహదారులు, గార్బేజ్ పాయింట్ల వద్ద పర్యవేక్షణకు కట్టుదిట్టం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు రోడ్లపై చెత్త వేయకుండ ఉండేందుకు నగరంలోని పలు ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, చెత్త వేస్తున్న దృశ్యాలు కెమెరాలకు చిక్కిన వెంటనే వాటిని సోషల్ మీడియాలో విడుదల చేస్తామని అన్నారు. అనంతరం సంబంధిత వ్యక్తులకు అవగాహన కల్పించడంతో పాటు బాధ్యులపై జరిమానా విధిస్తామన్నారు.