Share News

ఆ ఖైదీలకు బెయిల్‌ మంజూరయ్యేలా చూడాలి

ABN , Publish Date - Jul 17 , 2026 | 11:21 PM

ఉమ్మడి కర్నూలు జిల్లాలో బెయిల్‌ లభించకుండా అండర్‌ ట్రయల్స్‌గా జైళ్లలో ఉన్న ఖైదీలకు త్వరగా బెయిల్‌ మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ధి సూచించారు.

ఆ ఖైదీలకు బెయిల్‌ మంజూరయ్యేలా చూడాలి
మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయాధికారి కబర్ధి

జిల్లా ప్రధాన న్యాయాధికారి కబర్ధి

కర్నూలు లీగల్‌, జూలై 17 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కర్నూలు జిల్లాలో బెయిల్‌ లభించకుండా అండర్‌ ట్రయల్స్‌గా జైళ్లలో ఉన్న ఖైదీలకు త్వరగా బెయిల్‌ మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ధి సూచించారు. స్థానిక జిల్లా కోర్టులో అండర్‌ ట్రయల్‌ ఖైదీల కమిటీ, హిట్‌ అండ్‌ రన్‌ కేసులపై ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన పోలీసు, రెవెన్యూ జైళ్ల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రధాన న్యాయాధికారి మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు అండర్‌ ట్రయల్‌ రివ్యూ కమిటీ జైళ్లలో విచారణ కోసం ఎదురు చూస్తున్న ఖైదీల హక్కుల చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను కోరారు. చిన్న చిన్న నేరాలు చేసి పేదరికంతో బెయిల్‌ పొందలేక దీర్ఫకాలికంగా జైళ్లలో ఉంటున్న నిందితుల కేసులపై సమీక్షించి వారికి బెయిల్‌ ఎందుకు రాలేదో తెలుసుకుని చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలు, అనారోగ్యంతో బాధపడుతున్న నిందితు లకు సత్వరంగా బెయిల్‌ లభించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ తర్వాత ఉమ్మడి కర్నూలు జిల్లాలో నమోదైన హిట్‌ అండ్‌ రన్‌ కేసులపై సమీక్షించారు. హిట్‌ అండ్‌ రన్‌ కేసులో బాధితులకు సత్వరంగా నష్టపరిహారం అందేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. హిట్‌ అండ్‌ రన్‌ కేసులలో జిల్లా స్థాయి కమిటీలతో సమన్వయం చేసుకుని ఇన్సూరెన్స్‌ మొత్తం బాధితులకు సత్వరంగా అందేలా పోలీసు, రెవెన్యూ, భీమా కంపెనీ అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ తర్వాత 8వ తరగతి, ఆ పైన చదువుతు న్న గిరిజన, దివ్యాంగుల, అనాథ విద్యార్థినుల సుప్రీం కోర్టు అందజేస్తున్న ప్రజ్య స్కాలర్‌షిప్‌ను పొందేందుకు జిల్లాకు ఒకరి పేరు చొప్పున ప్రతి పాదనలు ఈ నెల 21వ తేదీలోపు పంపించాలని కలెక్టర్లకు సూచించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, డీఆర్వోలు, ట్రాన్స్‌పోర్టు అధికారులు, డీఎంహెచ్‌వో అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 17 , 2026 | 11:21 PM