కలెక్టర్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు
ABN , Publish Date - Jan 25 , 2026 | 11:56 PM
విజయవాడలో ఆదివారం నిర్వహించిన 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా స మగ్ర ఎన్నికల నిర్వహణలో జిల్లా ఎన్నికల అధికారిగా విశేష సేవలు అందించినందుకు నంద్యాల కలెక్టర్ రాజకుమారికి రాష్ట్రస్థాయి గుర్తింపు లభించింది.
ప్రశంసలు, నగదు పురస్కారం ప్రదానం
నంద్యాల నూనెపల్లి, జనవరి 25 (ఆంధ్రజ్యోతి) : విజయవాడలో ఆదివారం నిర్వహించిన 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా స మగ్ర ఎన్నికల నిర్వహణలో జిల్లా ఎన్నికల అధికారిగా విశేష సేవలు అందించినందుకు నంద్యాల కలెక్టర్ రాజకుమారికి రాష్ట్రస్థాయి గుర్తింపు లభించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆమె సేవలను ప్రశంసిస్తూ అవార్డును ప్రదానం చేసింది. ఈ సందర్భంగా నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానంద్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ కలెక్టర్‌కు ప్రశంసాపత్రం, జ్ఞాపికతో పాటు రూ.20 వేల నగదు పురస్కారాన్ని అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ గుర్తింపు జిల్లా పరిపాలనకు గర్వకారణమన్నారు.
నేడు పీజీఆర్‌ఎస్ రద్దు
77వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 26న కలెక్టరేట్లో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నటుకలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.