అటవీ అధికారులకు నక్షత్ర తాబేలు
ABN , Publish Date - Jun 26 , 2026 | 12:04 AM
ఆత్మకూరు పట్టణంలోని ఒక నీటికుంట వద్ద ఓ యువకుడికి అరుదైన నక్షత్ర తాబేలు లభించింది.
ఆత్మకూరు, జూన్ 25(ఆంధ్రజ్యోతి): ఆత్మకూరు పట్టణంలోని ఒక నీటికుంట వద్ద ఓ యువకుడికి అరుదైన నక్షత్ర తాబేలు లభించింది. దీన్ని గురువారం అటవీ అధికారులకు అప్పగించారు. పట్టణానికి చెందిన సమీర్ అనే యువకుడికి పట్టణంలోని ఓ నీటికుంట వద్ద నక్షత్ర తాబేలు లభించడంతో అతను సంఘ మిత్ర ఎనిమల్ ఫౌండేషన్ ప్రతినిధి ఇస్మాయిల్‌కు సమాచారం ఇచ్చాడు. ఆయన సూచన మేరకు ఆత్మకూరు టైగర్ ప్రాజెక్ట్ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అప్పావ్‌ను కలిసి తమకు లభించిన నక్షత్ర తాబేలును ఇచ్చాడు. ఆయన దాన్ని బైర్లూటి ఎనిమల్ డిస్పెస్షనరీలో ఉంచి పర్యవేక్షించాలని తమ సిబ్బందికి ఆదేశించారు. త్వరలోనే నత్రక్ష తాబేలును సురక్షితమైన ప్రదేశానికి తరలించనున్నట్లు తెలిసింది.