Share News

సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం

ABN , Publish Date - Apr 17 , 2026 | 11:08 PM

విధి నిర్వహణ, శాంతి భద్రతల పరిరక్షణలో నిత్యం బిజీగా గడిపే పోలీసు సిబ్బంది సంక్షేమానికి అత్యధిక ప్రాధా న్యం ఇవ్వనున్నట్లు ఎస్పీ సునీల్‌ షెరాన్‌ తెలిపారు.

సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం
సిబ్బందిని సమస్యలు అడిగి తెలుసుకుంటున్న ఎస్పీ సునీల్‌ షెరాన్‌

ఎస్పీ సునీల్‌ షెరాన్‌

నంద్యాల క్రైం, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణ, శాంతి భద్రతల పరిరక్షణలో నిత్యం బిజీగా గడిపే పోలీసు సిబ్బంది సంక్షేమానికి అత్యధిక ప్రాధా న్యం ఇవ్వనున్నట్లు ఎస్పీ సునీల్‌ షెరాన్‌ తెలిపారు. పట్టణంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం పోలీస్‌ గ్రీవెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ 12మంది పోలీసులు, హోంగార్డులు, సిబ్బంది సమస్యలను స్వయంగా అడిగి తెసుకుని పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. సిబ్బంది సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఎస్పీ మాట్లాడుతూ విధుల్లో సిబ్బంది ఇబ్బంది పడకుండా సమస్యలను తొలగించి ప్రజలకు మెరుగైన సేవలందించడమే తమ లక్ష్యమని చెప్పారు.

Updated Date - Apr 17 , 2026 | 11:08 PM