Share News

పరీక్షలు ప్రారంభం

ABN , Publish Date - Mar 17 , 2026 | 12:24 AM

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. మండలంలో 1615 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 1608 విద్యార్థులు పరీక్షలు రాశారు. 7 మంది విద్యార్థులు గైర్హాజరైయ్యారని డిప్యూటీ డీఈవో వెంకట్రామిరెడ్డి తెలిపారు.

పరీక్షలు  ప్రారంభం
కొలిమిగుండ్ల మోడల్‌ పాఠశాలలో విద్యార్థులు

డోన్‌, బనగానపల్లె, ఆళ్లగడ్డ నియోజవర్గాల్లో పదో తరగతి పరీక్షలు మొదటిరోజు ప్రశాంతం

డోన్‌ టౌన్‌, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. మండలంలో 1615 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 1608 విద్యార్థులు పరీక్షలు రాశారు. 7 మంది విద్యార్థులు గైర్హాజరైయ్యారని డిప్యూటీ డీఈవో వెంకట్రామిరెడ్డి తెలిపారు. డీఎస్పీ శ్రీనివాస్‌, ఎస్‌ఐ ఇంతియాజ్‌ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. ఎంఈవోలు ప్రభాకర్‌, రఘునాయక్‌ పరిశీలించారు.

బనగానపల్లె: పట్టణంలో మొత్తం 6 పరీక్షా కేంద్రాలో విద్యార్థులు పరీక్షలు రాశారు. మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, బీసీ ఇందిరమ్మ విద్యార్థులకు ఉచిత చల్లటి తాగునీరు అందించారు.

కొలిమిగుండ్ల: మండలంలో 537 మంది విద్యార్థులుండగా 521మంది హాజరయ్యారని, ఆరుగురు గైర్హాజరు అయినట్లు ఎంఈవో అబ్దుల్‌కలాం వెల్లడించారు.

సంజామల: మండలంలో మొత్తం 376 మంది విద్యార్ధుల కోసం సంజామల, కానాల, నొస్సం గ్రామాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎస్‌ఐ రమణయ్య సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. ముగ్గురు విద్యార్థులు గర్హాజరైనట్లు ఎంఈవో ఈశ్వరయ్య తెలిపారు.

చాగలమర్రి: మండంలో 703 మంది విద్యార్థులకుగాను 686 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 17 మంది గైర్హాజరయ్యారని ఎంఈవోలు శేషశయనారెడ్డి, న్యామతుల్ల తెలిపారు.

ఉయ్యాలవాడ: మండలలోని ఆదర్శ పాఠశాలలో 240 మందికి గాను నలుగురు గైర్హాజరైనట్లు డిపార్ట్‌మెంటల్‌ అధికారి విప్ర ఆచారి తెలిపారు.

అవుకు: జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, సెయింట్‌ మేరీస్‌ మూడు పరీక్షా కేంద్రాల్లో 570 మంది విద్యార్థులకు గాను 553 మంది హాజరుకాగా, 17 మంది గైర్హాజరైనట్లు ఎంఈవో శ్రీధర్‌రావు తెలిపారు. ఎస్‌ఐ అశోక్‌ 144 సెక్షన్‌ను అమలు చేశారు.

శిరివెళ్ల: మండలంలోని యర్రగుంట్ల, శిరివెళ్ల జడ్పీ ఉన్నత పాఠశాలల వద్ద, శిరివెళ్లలోని మోడల్‌ స్కూల్‌లో మూడు పరీక్షా కేంద్రాల్లో 598 మందికి గాను మొదటి రోజు 576 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 22 మంది గైర్హాజరయ్యారు.

కోవెలకుంట్ల: మండలంలో 534 మందికి 527 విద్యార్థులు పరీక్ష రాశారని, 7మంది గైర్హాజరైనట్లు ఎంఈవో వెంకటసుబ్బయ్య తెలిపారు.

ఆళ్లగడ్డ: మండలంలోని ఆరు పరీక్షా కేంద్రాల్లో 1,303 మందికి గాను 1,284 విద్యార్థులు హాజరయ్యారని, 19 మంది విద్యార్థులు గైర్హాజరయినట్లు ఎంఈవో తెలిపారు.

బేతంచెర: మండలంలో మొత్తం 1094 మంది విద్యార్ధుల పరీక్ష రాయాల్సి ఉండగా, వీరిలో ఏడు మంది గైర్హాజరైనట్లు ఎంఈవో సోమశేఖర్‌ తెలిపారు. ఎస్‌ఐ రమేష్‌ బాబు బందోబస్తు నిర్వహించారు.

Updated Date - Mar 17 , 2026 | 12:24 AM