Share News

అడుగంటుతున్న శ్రీశైలం రిజర్వాయర్‌

ABN , Publish Date - Nov 15 , 2026 | 11:47 PM

రెండు తెలుగు రాష్ట్రాలకు సాగు, తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి రోజు దిగువకు అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు.

అడుగంటుతున్న శ్రీశైలం రిజర్వాయర్‌
సంగమేశ్వరం వద్ద అడుగంటిన శ్రీశైలం రిజర్వాయర్‌

వేసవికి ముందే తాగునీటి కష్టాలు

ఆందోళనలో ప్రజలు

కొత్తపల్లి, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): రెండు తెలుగు రాష్ట్రాలకు సాగు, తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి రోజు దిగువకు అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో వేసవికి ముందే శ్రీశైలం రిజర్వాయరు అడుగంటుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక ఖాళీగా ఉన్న శ్రీశైలం రిజర్వాయరుకు గత ఆగస్టు నెలలో ఎగువ ప్రాంతాలో కురిసిన భారీ వర్షాలకు ఓ మోస్తరు నీరు రిజర్వాయరుకు వచ్చి చేరింది. అయితే ఈ నీటిని రెండు తెలుగు రాష్ట్రాలకు సాగు, తాగునీటి అవసరాల కోసం నీరు విడుదల చేస్తుండడంతో శ్రీశైల జలాశయం ఖాళీ అవుతోంది. శ్రీశైలం రిజర్వాయర్‌ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ఆదివారం సాయంత్రం 6 గంటల సమయానికి 829.10 అడుగులు కాగా, పూర్తి స్థాయి నీటి నిల్వలు 215 టీఎంసీలు కాగా, కేవలం 48.5733 టీఎంసీలుగా ఉంది. ఇలా సాగు, తాగునీటి అవసరాల కోసం రోజు వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతున్న సందర్బంగా రానున్న వేసవిలో నీటి కష్టాలు ఏర్పడి గుక్కెడు నీరు కరువవుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే గ్రామాల్లో ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక బావులు, బోర్లు అడుగంటుతుండడంతో ఇప్పటి నుంచే ఆయా గ్రామాల్లో ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు.

Updated Date - Nov 15 , 2026 | 11:47 PM