Share News

నిండు కుండలా శ్రీశైల జలాశయం

ABN , Publish Date - Aug 24 , 2026 | 11:13 PM

శ్రీశైల జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వకు చేరువలో ఉంటూ నిండుకుండలా తలపిస్తోంది.

నిండు కుండలా శ్రీశైల జలాశయం
శ్రీశైల జలాశయం

166 టీఎంసీల నీటి నిల్వలు

శ్రీశైలం, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వకు చేరువలో ఉంటూ నిండుకుండలా తలపిస్తోంది. గత పది రోజులుగా వరద ప్రవాహం పూర్తిగా నిలిచిపోవడంతో రిజర్వాయర్‌ నీటి నిల్వ 166 టీఎంసీల వద్ద నిలిచిపోయింది. సోమవారం జూరాల ప్రాజెక్టు విద్యుదుత్పత్తి నుంచి 7,134 క్యూసెక్కులు విడుదల కాగా సాయంత్రం శ్రీశైల జలాశయానికి 18,522 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుకుంది. అదే విధంగా కుడిగట్టు విద్యుదుత్పత్తి తాత్కాలికంగా నిలిపివేయగా, ఎగువన ఉన్న ప్రాజెక్టులు, కాలువలతోపాటు ఎడమగట్టు తెలంగాణ విద్యుదుత్పత్తి ద్వారా 35,315 క్యూసెక్కుల నీటిని వినియోగించి దిగువ సాగర్‌ ప్రాజెక్టుకు విడుదల చేశారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకుగాను ప్రస్తుతం 875.50 అడుగులు, పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలకుగాను ప్రస్తుతం 166.705 టీఎంసీలు మాత్రమే నీటినిల్వ ఉన్నట్లు నమోదయ్యిందని అధికారుల తెలిపారు.

Updated Date - Aug 24 , 2026 | 11:13 PM