Share News

భక్తులతో శ్రీశైలం కిటకిట

ABN , Publish Date - Jul 19 , 2026 | 11:55 PM

అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆదివారం శ్రీశైల క్షేత్రం కిటకిటలాడింది. శివనామ స్మరణతో క్యూలైన్లు కంపార్టుమెంట్లు మర్మోగిపోతూ ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతారణం నెలకొంది.

భక్తులతో శ్రీశైలం కిటకిట
ప్రధాన గోపురం నుంచి దర్శనానికి వెళ్తున్న భక్తులు

శ్రీశైలం, జూలై 19 (ఆంధ్రజ్యోతి): అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆదివారం శ్రీశైల క్షేత్రం కిటకిటలాడింది. శివనామ స్మరణతో క్యూలైన్లు కంపార్టుమెంట్లు మర్మోగిపోతూ ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతారణం నెలకొంది. తెల్లవారుజాము నుంచి ఉచిత శీఘ్ర అతిశీఘ్ర దర్శనాలు చేసుకునే భక్తులకు అలంకార దర్శనాలు కల్పించి ఆన్‌లైన్‌, మనమిత్ర వాట్సాప్‌ ద్వారా ముందుగా స్పర్శ దర్శనం టిక్కెట్లు నమోదు చేసుకున్న భక్తులకు ఉభయ దేవాలయాల్లో స్వామి, అమ్మవార్ల దర్శనం కల్పించారు. అనంతరం రాత్రి వరకు అలంకార దర్శనాలు మాత్రమే అందుబాటులో ఉండగా సిఫార్సు లేఖల ద్వారా వచ్చిన వీఐపీ బ్రేక్‌ స్పర్శ దర్శనం టెక్కెట్లు పొందిన వారికి రాత్రి 9 గంటల నుంచి ఆలయ ప్రవేశానికి అనుమతించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్న ప్రసాద భవనంలో శుచి శుభ్రతతో వండిన వంటకాలను వడ్డించారు. ఆర్జిత సేవా టిక్కెట్లు, దర్శనం, లడ్డూ ప్రసాదాలు, కేశఖండన టిక్కెట్లను దేవాదాయ అధికారిక వెబ్‌సైట్లలో మాత్రమే నమోదు చేసుకోవాలని ఈవో శ్రీనివాసరావు భక్తులను కోరారు.

Updated Date - Jul 19 , 2026 | 11:55 PM