శ్రీమఠం హుండీ ఆదాయం రూ.3.04 కోట్లు
ABN , Publish Date - Oct 01 , 2026 | 11:45 PM
మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం హుండీ ఆదాయం రూ.3,04,37,906 నగదు వచ్చినట్లు మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, వెంకటేష్ జోషి, సురేష్ కోణాపూర్ తెలిపారు.
మంత్రాలయం, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం హుండీ ఆదాయం రూ.3,04,37,906 నగదు వచ్చినట్లు మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, వెంకటేష్ జోషి, సురేష్ కోణాపూర్ తెలిపారు. గురువారం సెప్టెంబరు నెల 9వ తేదీ నుంచి అక్టోబరు 1వ తేదీ వరకు 22 రోజుల హుండీని మఠం గురురాజాంగణ భవనంలో దేవదాయ శాఖ కర్నూల్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫీస్ నుంచి కమలాకర్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన పోలీసు భధ్రత, సీసీ కెమరాల నిఘా మధ్య లెక్కించినట్లు తెలిపారు. రూ. 3,04,37,906 నగదుతో పాటు 285 గ్రాముల వెండి, 48 గ్రాములు బంగారు, వివిధ దేశాల కరెన్సీ వచ్చినట్లు చెప్పారు. వచ్చిన నగదును శ్రీమఠం బ్యాంకు ఖాతాకు జమచేసినట్లు తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో శ్రీపతి ఆచార్, అనంతపురాణిక్, చిలకలడోణ రాఘవేంద్రరావు, జేపీస్వామి, దత్తుస్వామి, లక్ష్మికాంత్, దేశాయ్ నరసింహమూర్తి, గిరిధర్, సుజ్ఞానేంద్ర, గోపి, వెంకటేష్, రవికురి,్ణ రవిరాజ్ తదితరులు పాల్గొన్నారు.