శ్రీమఠం హుండీ ఆదాయం రూ.2.48కోట్లు
ABN , Publish Date - Mar 31 , 2026 | 10:55 PM
శ్రీమఠం హుండీ ఆదాయం రూ.2.48 కోట్లు వచ్చినట్లు మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, వెంకటేష్ జోషి తెలిపారు.
మంత్రాలయం, మార్చి 31(ఆంధ్రజ్యోతి): శ్రీమఠం హుండీ ఆదాయం రూ.2.48 కోట్లు వచ్చినట్లు మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, వెంకటేష్ జోషి తెలిపారు. మంగళవారం మార్చి 10వ తేదీ నుంచి మార్చి 31తేదీ వరకు 21 రోజుల హుండీని మఠం గురురాజాంగణ భవనంలో దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన పోలీసు భద్రత, సీసీ కెమెరాల నిఘా మధ్య లెక్కించారు. రూ.2,48,28,737 నగదుతో పాటు 2163 గ్రాముల వెండి, 14 గ్రాములు బంగారు, వివిధ దేశాల కరెన్సీ వచ్చినట్లు చెప్పారు. వచ్చిన నగదును శ్రీమఠం బ్యాంకు ఖాతాకు జమ చేసినట్లు తెలిపారు. ఈలెక్కింపులో చిలకలడోణ రాఘవేంద్రరావు, జేపీస్వామి, కృష్ణమూర్తి, దేశాయ్ నరసింహమూర్తి, గిరిధర్, సుజ్ఞానేంద్ర, గోపి, వెంకటేష్ పాల్గొన్నారు.