Share News

శ్రీమఠం హుండీ ఆదాయం రూ.3.71కోట్లు

ABN , Publish Date - Jul 15 , 2026 | 11:25 PM

మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం హుండీ ఆదాయం రూ.3,71,35,259 నగదు వచ్చినట్లు మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, వెంకటేష్‌ జోషి, సురేష్‌ కోణాపూర్‌ తెలిపారు.

శ్రీమఠం హుండీ ఆదాయం రూ.3.71కోట్లు
హుండీ ఆదాయాన్ని లెక్కిస్తున్న భక్తులు

మంత్రాలయం, జూలై 15 (ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం హుండీ ఆదాయం రూ.3,71,35,259 నగదు వచ్చినట్లు మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, వెంకటేష్‌ జోషి, సురేష్‌ కోణాపూర్‌ తెలిపారు. జూన్‌ 23వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు 22 రోజుల హుండీని మఠం బుధవారం గురురాజాంగణ భవనంలో దేవదాయ శాఖ కర్నూల్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫీస్‌ నుంచి బిందుబాయి ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన పోలీసు భద్రత, సీసీ కెమెరాల నిఘా మధ్య లెక్కించినట్లు తెలిపారు. నగదుతో పాటు 1085 గ్రాముల వెండి, 23గ్రాములు బంగారు, వివిధ దేశాల కరెన్సీ వచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో శ్రీపతి ఆచార్‌, అనంతపురాణిక్‌, చిలకల డోణ రాఘవేంద్రరావు, జేపీస్వామి,రాఘవేంద్ర పురాణిక్‌, కృష్ణమూర్తి, దత్తుస్వామి, దేశాయ్‌ నరసింహమూర్తి, గిరిధర్‌, సుజ్ఞానేంద్ర, గోపి, వెంకటేష్‌పాల్గొన్నారు.

Updated Date - Jul 15 , 2026 | 11:25 PM