శ్రీమఠం హుండీ లెక్కింపు
ABN , Publish Date - Apr 22 , 2026 | 11:27 PM
శ్రీమఠం హుండీ ఆదా యం రూ.3,25,96,854 నగదు వచ్చినట్లు మఠం ఏఏవో మాధవ శెట్టి, మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, వెంకటేష్ జోషి తెలిపారు
ఆదాయం రూ.3.26 కోట్లు
మంత్రాలయం, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి): శ్రీమఠం హుండీ ఆదా యం రూ.3,25,96,854 నగదు వచ్చినట్లు మఠం ఏఏవో మాధవ శెట్టి, మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, వెంకటేష్ జోషి తెలిపారు. మార్చి 31వ తేదీ నుంచి ఏప్రిల్ 21వ తేదీ వరకు 22 రోజుల హుండీని మఠం గురురాజాంగణ భవనంలో దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుధాక ర్‌రెడ్డి ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన పోలీసు భధ్రత, సీసీ కెమెరాల నిఘా మధ్య బుధవారం లెక్కించారు. రూ.3,25,96,854 నగదుతో పాటు 592 గ్రాముల వెండి, 47గ్రాములు బంగారు, వివిధ దేశాల కరెన్సీ వచ్చినట్లు మఠం ఏఏవో మాధవశెట్టి తెలిపారు. నగదును శ్రీమఠం బ్యాంకు ఖాతా కు జమ చేశామన్నారు. ఈ లెక్కింపులో అనంతపురాణిక్, చిలకల డోణ రాఘవేంద్రరావు, జేపీస్వామి, కృష్ణమూర్తి, దేశాయ్ నరసింహ మూర్తి, గిరిధర్, సుజ్ఞానేంద్ర, గోపి, వెంకటేష్ పాల్గొన్నారు.