శ్రీమఠం హుండీ లెక్కింపు
ABN , Publish Date - Feb 10 , 2026 | 11:12 PM
మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం హుండీని మంగళవారం లెక్కించారు. ఆదాయం రూ.3,08,37,571 నగదు వచ్చినట్లు మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, వెంకటేష్ జోషి, సురేష్ కోణాపూర్ తెలిపారు.
ఆదాయం రూ.3.08 కోట్లు
మంత్రాలయం, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం హుండీని మంగళవారం లెక్కించారు. ఆదాయం రూ.3,08,37,571 నగదు వచ్చినట్లు మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, వెంకటేష్ జోషి, సురేష్ కోణాపూర్ తెలిపారు. జనవరి, ఫిబ్రవరి నెలలోని 21 రోజుల హుండీని మఠం గురురాజాంగణ భవనంలో దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత, సీసీ కెమెరాల నిఘా మధ్య హుండీ లెక్కించినట్లు తెలిపారు. రూ.3,08,37,571 నగదుతో పాటు 1018 గ్రాముల వెండి, 13 గ్రాములు బంగారు, వివిధ దేశాల కరెన్సీ వచ్చిందన్నారు. నగదును శ్రీమఠం బ్యాంకు ఖాతాలో జమచేసినట్లు తెలిపారు. అనంత పురాణిక్, దత్తుస్వామి, జేపీస్వామి, కృష్ణమూర్తి, దేశాయ్ నరసింహమూర్తి, గిరిధర్, సుజ్ఞానేంద్ర, శ్రీపాదాచార్ పాల్గొన్నారు.