Share News

శివనామ స్మరణతో మార్మోగిన శ్రీగిరి

ABN , Publish Date - Mar 13 , 2026 | 11:31 PM

శ్రీశైల క్షేత్రం శివనామ స్మరణతో మార్మోగుతుంది. కన్నడ భక్త బృందాలతో కోలాహలంగా మారింది.

శివనామ స్మరణతో మార్మోగిన శ్రీగిరి
అటవీమార్గంలో పాదయాత్రగా వస్తున్నభక్తులు

స్పర్శ దర్శనానికి బారులుదీరిన భక్తులు

శ్రీశైలం, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల క్షేత్రం శివనామ స్మరణతో మార్మోగుతుంది. కన్నడ భక్త బృందాలతో కోలాహలంగా మారింది. రోజుకు సుమారు 50వేల మంది భక్తులకు పైగా క్షేత్రానికి వచ్చి వెళ్తున్నట్లు అధికారుల అంచనా. పాతాళగంగ వద్ద పుణ్య స్నానాలు చేసుకుని స్వామిఅమ్మవార్లకు మొక్కులు తీర్చుకునేందుకు క్యూలైన్లలో గంటల తరబడి వేచిఉంటూ ఉభయ దేవాలయాల్లో దర్శనాలు పూర్తి చేసుకుంటు న్నారు. రోజుకు నాలుగు విడతలుగా సుమారు 20,000మందికిపైగా భక్తులకు స్పర్శ దర్శనాలు కల్పించినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. క్యూలైన్‌లో వేచి ఉండే భక్తులకు తాగునీరు, అల్పాహారం, బిస్కెట్లు, అందజేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అటవీమార్గంలో వచ్చే భక్తులకు దేవస్థానం, స్వచ్ఛంద సంస్థల వారు అన్నదానం, వైద్యసేవలను అందిస్తున్నారు.

Updated Date - Mar 13 , 2026 | 11:31 PM