Share News

శ్రీగిరి... భక్త జనసంద్రం

ABN , Publish Date - Apr 26 , 2026 | 11:39 PM

మల్లన్నను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో శ్రీగిరి క్షేత్రం భక్త జనసంద్రంగా మారింది.

శ్రీగిరి... భక్త జనసంద్రం
దర్శనానికి కంపార్ట్‌మెంట్‌లో వేచిఉన్న భక్తులు

రెండు స్లాట్‌లలో మాత్రమే స్పర్శ దర్శనాలు

శ్రీశైలం, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): మల్లన్నను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో శ్రీగిరి క్షేత్రం భక్త జనసంద్రంగా మారింది. వారాంతపు సెలవులు కలసి రావడంతో గర్భాలయ స్పర్శ దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుండి భక్తులు క్షేత్రానికి చేరుకుంటూనే ఉన్నారు. ఆదివారం తెల్లవారుజా మున తలనీలాలు సమర్పించుకుని కృష్ణమ్మ ఒడిలో నదీస్నానాలు చేసి పసుపు కుంకుమలతో కృష్ణమ్మకు సారెలు సమర్పించుకున్నారు. స్వామి అమ్మవార్ల వీఐపీ అలంకార దర్శనం టిక్కెట్లు పొందిన వారికి గంట సమ యం, అతి శీఘ్ర దర్శనం వారికి రెండు, శీఘ్ర, ఉచిత దర్శనం వారికి మూడు గంటల సమయంలో ఉభయ, పరివార దేవతాలయాల దర్శనాలు పూర్తవు తున్నాయని ఆలయాధికారులు తెలిపారు. సామాన్య భక్తులకు క్యూలైన్లలో పాలు, తాగు నీరు, మజ్జిగ, అల్పాహారం, పిల్లలకు బిస్కెట్‌ ప్యాకెట్లు అందిం చారు. దర్శనానం తరం భక్తులకు పలు సాధకాలతో అన్నదాన భవనంలో భోజన ప్రసాద వితరణ చేశారు. సామాన్య భక్తుల దర్శనాలకు ఆటంకం లేకుండా గర్బాలయ స్పర్శ దర్శనాలను ఉదయం, రాత్రి వేళల్లో మాత్రమే కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Updated Date - Apr 26 , 2026 | 11:39 PM