భక్తులతో కిక్కిరిసిన శ్రీమఠం
ABN , Publish Date - Sep 21 , 2026 | 12:27 AM
రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో మంత్రాలయం సాగరంగా మారింది.
మంత్రాలయం, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో మంత్రాలయం సాగరంగా మారింది. ఆదివారం సెలవుదినం కావటంతో దక్షిణాది రాష్ర్టాలైన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి వే లాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో మఠం ప్రాంగణం భక్త్తులతో కిక్కిరిసింది. తుంగభద్ర నదిలో పుణ్య స్నానాలు ఆచరించి గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకొని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో ప్రధానరహదారులు ట్రాఫిక్‌తో అస్తవ్యస్తంగా మారింది. సర్వ దర్శనానికి దాదాపు 3 గంటల సమయం పట్టింది. భజనమండలి మహిళల గీతాలాపనచే శ్రీమఠం మార్మోగింది.