క్రీడాకారులకు పండుగే..!
ABN , Publish Date - Feb 13 , 2026 | 12:51 AM
ప్రతినెలా క్రీడా పోటీలు నిర్వహించడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. యువ క్రీడాకారుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆయా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ప్రాంగణంలో క్రీడా పోటీలు నిర్వహించేందుకు క్యాలెండర్‌ను విడుదల చేసింది.
31 క్రీడాంశాల్లో పోటీల నిర్వహణకు ప్రభుత్వ నిర్ణయం
డిసెంబరు వరకు జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల నిర్వహణ
నంద్యాల హాస్పిటల్, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): ప్రతినెలా క్రీడా పోటీలు నిర్వహించడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. యువ క్రీడాకారుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆయా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ప్రాంగణంలో క్రీడా పోటీలు నిర్వహించేందుకు క్యాలెండర్‌ను విడుదల చేసింది. 31 క్రీడాంశాల్లో జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించేందుకు శాప్ నిర్ణయించింది. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరచిన క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనేందుకు శాప్ శిక్షకులచే ప్రత్యేక శిక్షణ ఇప్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మేరకు శాప్ ఆయా జిల్లా క్రీడల అభివృద్ధి అధికారులకు జారీ చేసింది. ఈనెల 21 నుంచి డిసెంబరు 28 వరకు వివిధ రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించనున్నారు. అలాగే ప్రతినెల ఈ తేదీలకు అనుగుణంగా జిల్లా స్థాయిలో వివిధ పోటలు నిర్వహించడానికి సన్నద్ధం చేసుకున్నారు.
పోటీలు నిర్వహించే క్రీడలు ఇవే..
బాక్సింగ్, చదరంగం, సైక్లింగ్, వాటర్ స్పోర్ట్స్, అథ్లెటిక్స్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్, బీచ్ వాలీబాల్, హ్యాండ్ బాల్, వెయిట్ లిఫ్టింగ్, బీచ్ హ్యాండ్ బాల్, స్విమ్మింగ్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, బీచ్ ఫుట్‌బాల్, లాన్ టెన్నిస్, సాఫ్ట్ టెన్నిస్, ఆర్చరీ, జూడో, జిమ్నాస్టిక్స్, హాకీ, బీచ్ కబడ్డీ, రైఫిల్ షూటింగ్, బీచ్ సెఫక్‌తక్రా, అథ్లెటిక్స్(మాస్టర్స్), షటిల్ బ్యాడ్మింటన్(మాస్టర్స్), పారా స్పోర్ట్స్(అథ్లెటిక్స్), పారా స్పోర్ట్స్(స్విమ్మింగ్), పారా స్పోర్ట్స్(రైఫిల్ షూటింగ్).
ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
శాప్ లీగ్ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు శాప్ వెబ్‌సైట్‌లో క్రీడా యాప్‌లో రిజిస్ర్టేషన్ చేసుకోవాలి. రిజిస్ర్టేషన్ చేసుకున్న వారే పోటీల్లో పాల్గొనేందుకు అర్హులు. పోటీల్లో గెలుపొందిన వారికి క్రీడా యాప్ ద్వారానే సర్టిఫికెట్లు పొందడానికి అవకాశం ఉంటుంది. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.స్పోర్ట్స్.ఏపీ.జీవోవీ.ఇన్ అనే యాప్‌లో నమోదు చేసుకోవాలి.్ఝ - ఎంఎన్‌వీ రాజు, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి, నంద్యాల.