Share News

హెల్ప్‌ లైనతో సేవలు వేగవంతం

ABN , Publish Date - May 27 , 2026 | 12:09 AM

హెల్ప్‌ లైనతో నగర పాలక సంస్థ సేవలు ప్రజలకు సులువుగా, వేగంగా అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు తెలిపారు.

హెల్ప్‌ లైనతో సేవలు వేగవంతం
హెల్ప్‌ డెస్క్‌ను పరిశీలిస్తున్న కమిషనర్‌ చల్లా ఓబులేసు

నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు

కర్నూలు న్యూసిటీ, మే 26(ఆంధ్రజ్యోతి): హెల్ప్‌ లైనతో నగర పాలక సంస్థ సేవలు ప్రజలకు సులువుగా, వేగంగా అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు తెలిపారు. ప్రజలు కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండా ఉచితంగా ఫోన చేసి పలు రకాల సేవలు పొందవచ్చని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన నెంబరును మంగళవారం నగర పాలక కార్యాలయంలో కమిషనర్‌ ప్రారంభించి మాట్లాడారు. నగర ప్రజలు పారిశు ధ్యం, విద్యుత దీపాల మరమ్మతులు, తాగునీటి సరఫరా వంటి ప్రాథమిక సేవలకు సంబంధించిన ఫిర్యాదులు, సమస్యలను సులభంగా తెలియజే సేందుకు ప్రత్యేక టోల్‌ఫ్రీ నెంబర్‌ ఏర్పాటు చేశా మన్నారు. ఫిర్యాదుల కోసం 1800 425 9766 నెంబర్‌కు ఫోన చేయవచ్చని, వాట్సాప్‌ ద్వారా ఫిర్యాదులు పంపాలనుకునే వారు 7422992299 నెంబరకు సంప్రదించాలన్నారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు ప్రత్యేక హెల్ప్‌ డెస్క్‌ గది ఏర్పాటు చేశామన్నారు. డెస్క్‌లో పని చేసే సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కమిషనర్‌ ఆదేశించారు. కార్యక్ర మంలో కార్యదర్శి నాగరాజు, మేనేజర్‌ జునైద్‌, ఎస్‌ఈ జే.రమణమూర్తి, ప్రజారోగ్య అధికారి డా.ఎం.రఘు, ఎంఈ గిరిరాజు, సూపరింటెండెంట్లు రామకృష్ణ, క్రిష్టఫర్‌ పాల్గొన్నారు.

Updated Date - May 27 , 2026 | 12:09 AM