ఉగాది ఏర్పాట్లను వేగవంతం చేయండి
ABN , Publish Date - Mar 02 , 2026 | 11:15 PM
ఉగాది ఉత్సవాలకు కర్నాటక భక్తులు ముందుగానే అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది
ప్రారంభానికి ముందే భారీగా తరలిరానున్న భక్తులు
మౌలిక వసతుల ఏర్పాట్లు ముందస్తుగా పూర్తి చేయ్యాలి
శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు
శ్రీశైలం, ఫిబ్రవరి 02 (ఆంధ్రజ్యోతి): ఉగాది ఉత్సవాలకు కర్నాటక భక్తులు ముందుగానే అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి తగిన ఏర్పాట్లు వేగవంతం చేయాలని శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు అధికా రులను ఆదేశించారు. సోమవారం పరిపాలనా భవనంలో అధికారులతో సమావేశం నిర్వహించి, జరుగుతున్న పనులను తెలుసుకున్నారు. పది రోజుల ముందు నుంచే రోజుకు వేల సంఖ్యలో వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించాలని, అందులో పొరబాట్లు జరగకుండా అంకితభావం చూపాలని సిబ్బందికి సూచించారు. మార్చి 6 నుంచి 15 వరకు 10 రోజు లపాటు రోజుకు నాలుగు విడతలుగా స్పర్శ దర్శనం కల్పించ డంపై భక్తులలో అవగాహన పెంచేందుకు కర్నాటక ప్రసార మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేయిస్తున్నట్లు తెలిపారు. పాదయాత్ర భక్తులకు అటవీ మార్గంలో తగిన సదుపాయాలు కల్పించేలా ప్రత్యేక ప్రణా ళికలు చేసుకోవాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య, రెవిన్యూ, పోలీస్, ఫైర్, అటవి శాఖల జిల్లాస్థాయి అధికారులు సిబ్బంది సహకారంతో ఉగాది ఉత్సవాలను జయప్రదం చెయ్యాలని కోరారు.